Manu Bhaker Khel Ratna Controversy : 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలతో అదరగొట్టిన భారత షూటింగ్ స్టార్ మను భాకర్ చుట్టూ ఓ వివాదం నెలకొంది. ప్రతిష్ఠాత్మక ఖేల్ రత్న అవార్డు నామినేషన్ల నుంచి ఆమెను మినహాయించారని కొన్ని నివేదికలు రావడంతో అసలు చర్చ మొదలైంది. చాలా మంది ఒలింపిక్ పతక విజేతకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేశారు. అయితే జాతీయ క్రీడా అవార్డుల తుది జాబితాను ఇంకా ఖరారు చేయలేదని యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఓ వార్తా సంస్థ నివేదిక ప్రకారం, క్రీడా అవార్డుల నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు ఏ ఆటగాడిని మినహాయించలేదని తెలుస్తోంది.
నిరాశ వ్యక్తం చేసిన మను భాకర్ తండ్రి
అంతకుముందు మను భాకర్ తండ్రి, రామ్ కిషన్ భాకర్, ఈ వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వీడియోలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "ఖేల్ రత్న అవార్డు కోసం కమిటీ మను భాకర్‌ను పరిగణించకపోవడం చాలా షాకింగ్‌గా ఉంది. చాలా మంది మాజీ ఆటగాళ్ళు దీని గురించి మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే అధికారులు అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారిని మాత్రమే అర్హులుగా పరిగణిస్తామని చెప్పారు" అంటూ రామ్ కిషన్ అన్నారు.
Faridabad: After Manu Bhaker's name was not included for the Major Dhyan Chand Khel Ratna Award, Manu Bhaker's father, Ram Kishan Bhaker says, " it was very shocking that manu bhaker's name was not included in the recommendations by the sports committee. there was no discussion on… pic.twitter.com/SJLmqrD6Wu
— IANS (@ians_india) December 24, 2024
అసలు వివాదం ఏంటి?
మను అవార్డును పట్టించుకోలేదని మీడియాలో కథనాలు రావడంతో చర్చ మొదలైంది. తర్వాత క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు మను భాకర్ అసలు నామినేషన్ దాఖలు చేయలేదని, అవార్డులకు పరిగణనలోకి తీసుకోవాలంటే తప్పకుండా దరఖాస్తు చేయాలని వివరించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో సంచలనం
2024 పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ సంచలన ప్రదర్శన చేసింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా, ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఆమె ఉమెన్స్ ఇండివిడ్యువల్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్యం సాధించింది.
మను బాకర్‌కు దక్కని చోటు - 'ఖేల్ రత్న' నామినేషన్లపై మొదలైన వివాదం!
'ఎక్కడో తప్పు జరిగి ఉంటుంది, అయినా అవి నా లక్ష్యాలు కావు'- ఖేల్‌రత్న కాంట్రవర్సీపై మనూ