2025 BMW X3 SUV Launched: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW తన X3 SUVలో కొత్త వెర్షన్‌ను లాంఛ్ చేసింది. 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కంపెనీ ఈ X3 కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించింది.
వేరియంట్లు: ఈ ఫోర్త్ జనరేషన్ BMW X3 SUVని రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు.
- X3 20
- X3 20D
వీటిలో X3 20 అనేది పెట్రోల్ వేరియంట్. ఇక X3 20D డీజిల్ వేరియంట్.
డిజైన్: ఈ కొత్త BMW X3 SUV డిజైన్ పరంగా ప్రీవియస్ మోడల్‌తో పోలిస్తే దీన్ని చాలా మార్పులతో విడుదల చేశారు. ఇది ఫ్రంట్ బంపర్, కిడ్నీ గ్రిల్‌తో వస్తుంది. వీటితో పాటు దీనిలో ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ L- ఆకారపు DRLలతో సొగసైన LED హెడ్లైట్లు, వెనకవైపు Y- ఆకారపు LED టెయిల్‌ల్యాంప్స్ ఉన్నాయి.
ఇంటీరియర్:ఈ BMW X3 SUV కొత్త వెర్షన్ ఇంటీరియర్ డిజైన్‌ను పరిశీలిస్తే, BMW సరికొత్త iDrive9 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కర్వ్డ్ డిస్ప్లేతో అందించారు. ఇది కాకుండా ఇందులో ఫ్లాట్- బాటమ్ స్టీరింగ్, హీటెడ్ స్పోర్ట్స్ సీట్లు, కనెక్టెడ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇంజిన్:ఈ అప్డేటెడ్ నయా మోడల్లో 2-లీటర్ నాలుగు-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. దీని పెట్రోల్ ఇంజిన్ 206 bhp పవర్, 310 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సమయంలో దీని X3 20D డీజిల్ వేరియంట్ 197bhp శక్తిని, 400Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి.
ధర:ఈ నయా మోడల్ ధరను కంపెనీ రూ.75.8 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.