TVS Jupiter 110 Launched:ప్రముఖ టీవీఎస్ మోటార్ కంపెనీ మరో కొత్త జూపిటర్ 110 స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. గతంలో రిలీజ్ చేసిన మోడల్స్‌కు అనేక మెరుగులు దిద్ది దీన్ని అప్డేట్ చేసినట్లు కంపెనీ తెలిపింది. కొంగొత్త రంగులను అద్ది స్టైలిష్ లుక్‌లో దీన్ని డిజైన్ చేశారు. మరెందుకు ఆలస్యం ఈ స్కూటర్ వేరియంట్స్, ఫీచర్లు, ధర వంటి వివరాలు తెలుసుకుందాం రండి.
ఈ వెర్షన్లో కలర్ ఆప్షన్స్:
- డాన్ బ్లూ మ్యాట్
- గెలాక్టిక్ కాపర్ మ్యాట్
- స్టార్‌లైట్ బ్లూ గ్లాస్
TVS Jupiter 110 Features:
- ఈ స్కూటీలో ఫ్యూయెల్ సేవింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ స్టార్ట్, స్టాప్ సిస్టమ్‌ను పొందుపర్చారు.
- సిగ్నల్స్ దగ్గర తక్కువసేపు ఆపాలనుకునేటప్పుడు ఇంజిన్ దానికదే ఆఫ్ అయ్యేలా టీవీఎస్ iGo అసిస్ట్ ఆప్షన్‌ను ఇచ్చారు.
- ఫ్యూయెల్ నింపేందుకు ముందుభాగంలోనే ఇన్‌లెట్ ఉంది.
- మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, తక్కువ ఫ్యూయెల్ ఉన్నప్పుడు అలర్ట్ చేసే ఇండికేటర్ కూడా ఉన్నాయి.
- స్టార్ట్-స్టాప్, ఫ్యూయెల్, స్టోరేజ్ అన్నింటికీ ఒకే కీ ఉంది.
TVS Jupiter 110 Security Features:
- ఈ టీవీఎస్ జూపిటర్ 110లో అనేక భద్రతాపరమైన ఫీచర్లు ఉన్నాయి.
- ఫాలో మీ బెడ్‌ల్యాంప్ అనే కొత్త ఫీచర్‌ను ఇచ్చారు. స్కూటీని ఆఫ్ చేసిన తర్వాత కూడా చీకట్లో నడిచి వెళ్లేందుకు మార్గం కనిపించేలా హెడ్‌ల్యాంప్ కొంతసేపటి వరకు ఆన్‌లోనే ఉంటుంది.
- దీంతోపాటు ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఒక్కసారిగా బ్రేక్ వేసినప్పుడు వెనక నుంచి వచ్చేవారిని ఇది అప్రమత్తం చేస్తుంది.
- టర్నింగ్స్ దగ్గర ఇండికేటర్లను ఆన్ చేసి ఆఫ్ చేయటం మర్చిపోతే కొంత సేపటి తర్వాత వాటికవే ఆఫ్ అయిపోయే ఫీచర్‌ను సైతం అమర్చారు.
- సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు ఇంజిన్ ఆన్ కాకుండా ప్రత్యేక సిస్టమ్ ఏర్పాటు చేశారు.
- బ్రేక్‌డౌన్, ఎమర్జెన్సీ, తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలో ఇతరులను అప్రమత్తం చేసాలా హజార్డ్ ల్యాంప్స్ అమర్చారు.
- ప్రత్యేకంగా పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు.
- వీటితో పాటు వాయిస్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్‌ను ఈ వెర్షన్లో పొందుపర్చారు.
ఇంజిన్:
- సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్
- 9.8 ఎన్ఎమ్ టార్క్ ఎట్ 5,000 ఆర్‌పీఎం
- 5.9 బీహెచ్పీ పవర్ ఎట్ 6,500 ఆర్‌పీఎం