తెలంగాణ

telangana

ETV Bharat / state

చంద్రబాబుపై కేసులకు 'నో' - ఐపీఎస్​పై జగన్ సర్కార్ కక్ష సాధింపు - IPS Officer Santosh Mehra - IPS OFFICER SANTOSH MEHRA

IPS Officer Santosh Mehra Suffered : నిజాయతీపరులు, సమర్థులకు చీత్కారాలు అవినీతి, అక్రమాలకు సహకరించిన వారికి పదవులు, పదోన్నతులు. ఇదీ గత వైఎస్సార్సీపీ పాలన తీరు. తాను చెప్పినవాటికల్లా తలూపుతూ చేసిన వారిని నెత్తినెక్కించుకున్న జగన్ తన విధానాలను వ్యతిరేకించిన వారిని తీవ్రంగా వేధించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీపై ఎలా కక్షసాధింపులకు పాల్పడ్డారో తాను చెప్పిన అడ్డగోలు పనులు చేయనందుకు మరో సీనియర్ ఐపీఎస్ సంతోష్ మెహ్రాను అలానే అవమానించారు. ఆయన్ను ఏ విధంగా మానసిక హింసకు గురి చేశారో తెలిస్తే యంత్రాంగం పట్ల జగన్ వైఖరేంటో అర్థమవుతోంది.

IPS Santosh Mehra
IPS Santosh Mehra (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 2:11 PM IST

IPS Officer Santosh Mehra Suffered in YSRCP Government :సంతోష్‌ మెహ్రా ఉమ్మడి రాష్ట్రంలో ఏసీబీ డైరెక్టర్, రాయలసీమ జోన్‌ ఐజీ వంటి కీలక పదవులను నిర్వర్తించారు. 2012లో కేంద్ర సర్వీసులకు వెళ్లి బీఎస్ఎఫ్, జాతీయ మానవ హక్కుల సంఘంలో పని చేశారు. కేంద్రం ఆయనకు 2021లో డీజీపీ హోదా ఇచ్చింది. ఇలా ఇవ్వడం చాలా అరుదు. 2022 మార్చిలో అఖిల భారత అధికారులకు ఇచ్చే అత్యున్నత వేతన స్థాయి ‘లెవెల్‌ 17’ను ఇచ్చింది.

సంతోష్‌ మెహ్రా 2022 జులైలో తిరిగి ఆంధ్ర క్యాడర్‌కు వచ్చారు. తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు విభాగాధిపతి - డీజీపీ పోస్టుకు తన పేరును పరిశీలిస్తుందని ఆశించారు. రాష్ట్ర ముఖ్యనేతను కలిసి అభిలాషను వెల్లడించారు. ఇక్కడి రాజకీయాల దృష్ట్యా ఆ పోస్టులో ‘మా మనిషినే’ నియమించుకోవాల్సి ఉందని అందువల్ల ఇతర ముఖ్యమైన పోస్టుల్లో ఒక దానిని ఇస్తామని పదవీ విరమణ తర్వాతా ఏదైనా పదవి ఇస్తామని ముఖ్యనేత భరోసా ఇచ్చారు. పోనీ దానితోనైనా సరిపెట్టుకుందామన్న మెహ్రాకు రెండు షరతులు పెట్టారు.

ఏపీలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వసూళ్ల రజనీ ముఠా దందాలు - కోట్లు వసూలు చేశారుగా! - ap ex minister Rajini Corruption

చంద్రబాబుపై కేసులు పెట్టాలి : అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కక్షతో సస్పెండ్‌ చేసిన సీనియర్‌ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మళ్లీ కొత్తగా విచారణ చేసి, ఎఫ్ఐఆర్ 56 నిబంధన ప్రకారం ఆయన్ను సర్వీసు నుంచి నేరుగా తొలగించేందుకు వీలైన సిఫార్సులు చేయాలని అదే విధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా రకరకాల కేసులు పెట్టే బాధ్యతలు తీసుకోవాలని మెలిక పెట్టారు. ఆ షరతులు విని మెహ్రా నివ్వెరపోయారు. తాను ఇవి చేయలేనని తేల్చి చెప్పేశారు. ముఖ్య నేతను సంతోషపెట్టే పని చేస్తేనే ఆయన మిమ్మల్ని సొంత మనిషిలా భావిస్తారని అప్పుడే ముఖ్యమైన పోస్టు ఇవ్వడం సాధ్యపడుతుందని అధికారులు స్పష్టం చేశారు. దీనికితోడు గతంలో సంతోష్‌ మెహ్రా తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించారనే దుష్ప్రచారాన్ని ఇద్దరు సీనియర్‌ అధికారులు, అధికార పార్టీ ఎంపీ ఒకరు తెరపైకి తెచ్చారు. అంతే ఇక మెహ్రాపై వేధింపులు మొదలయ్యాయి.

వినలేదని కక్షసాధింపులు : సంతోష్‌ మెహ్రా తాము చెప్పింది వినేలాలేరనే అభిప్రాయానికి వచ్చాక ప్రభుత్వ పెద్దలు ఆయనకు తమదైన మార్కు హింసను చూపించాల్సిందేనని నిర్ణయించుకున్నారు. 2022 ఆగస్టులో సంతోష్‌ మెహ్రాను రాష్ట్ర స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డెరెక్టర్‌ జనరల్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అది అప్రాధాన్యమైన పోస్టు. అంతటితో ఆగకుండా మూడ్రోజులు తిరగకముందే మెహ్రాకు కేంద్రం ఇచ్చిన ‘లెవెల్‌ 17’ స్కేల్‌ను తగ్గించేసి మరింత క్షోభకు గురి చేసింది. ఎవరైనా అధికారి ఏదైనా తప్పు చేస్తేనో, ఏవైనా అవకతవకలకు పాల్పడితేనో ఇలాంటి చర్య తీసుకుంటారు. శాఖాపరంగా విచారణ గానీ అసలు అభియోగం గానీ లేకుండా ఒక సివిల్‌ సర్వీసు అధికారికి స్కేల్‌ తగ్గించిన సందర్భం గతంలో లేదు. కానీ కేవలం తమ మాట వినలేదన్న కారణంతో ఇలా కక్షసాధింపులకు పాల్పడ్డారు.

రాక్షసానందం :స్కేల్‌ తగ్గించడంపై సంతోష్‌ మెహ్రా పోరాటం మొదలెట్టారు. ప్రభుత్వ చర్య నిబంధనలకు విరుద్ధమంటూ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సమాధానం రాకపోవడంతో మరుసటి నెలలో మరో లేఖ రాశారు. కేంద్ర హోం శాఖకూ విషయాన్ని తెలిపారు. ఐపీఎస్ అధికారుల పేస్కేల్‌ రక్షణ విషయంలో 2018లో వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలంటూ 2022 అక్టోబరులో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్రం లేఖకూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో సీఎస్​కు మరో లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తనపట్ల ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తోందో కేంద్ర అధికారులకూ తెలిపారు.

విధిలేని పరిస్థితుల్లో సంతోష్‌ మెహ్రా పేస్కేల్‌ విషయంలో తగు సూచన ఇవ్వాలని సీఎస్ కేంద్రానికి లేఖ రాశారు. ఒకసారి లెవెల్‌-17 స్కేల్‌ను ఒక అధికారికి ఇచ్చాక దాన్ని కొనసాగించాల్సిందేనని హోంశాఖ ఆంధ్రప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్రాలకు 2022 డిసెంబరులో ప్రత్యేక సర్క్యులర్‌ పంపింది. సంతోష్‌ మెహ్రా తాము చెప్పింది చేయలేదని కక్ష పెట్టుకున్న జగన్‌ ప్రభుత్వం కేంద్ర ఉత్తర్వులను వెంటనే అమలు చేయలేదు. తాను 2023 ఫిబ్రవరి నెలాఖరున పదవీవిరమణ చేయాల్సి ఉన్నందున లెవెల్‌-17ను వెంటనే వర్తింపజేయాలని మెహ్రా అప్పటి సీఎస్ జవహర్‌రెడ్డికి మరో మూడు ఉత్తరాలు రాశారు. ఆయన లేఖల్లో ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదంటే ఒక సీనియర్‌ అధికారి పట్ల ఎంత అమానవీయంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఆయన సర్వీసు పూర్తయ్యాక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు లెవెల్‌-17 పేస్కేల్‌ను వర్తింపజేస్తూ 2023 మార్చిలో ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఆయన విధుల్లో కొనసాగినన్ని రోజులు తమదైన మార్కు హింసను రుచి చూపిస్తూ రాక్షసానందం పొందారు.

‘Y' కేటగిరీ రక్షణ కల్పించాలని జగన్‌ ప్రభుత్వానికి మెహ్రా 3 లేఖలు :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రవాద ప్రభావం బాగా ఎక్కువగా ఉన్న 1990-94ల మధ్య కాలంలో సంతోష్‌ మెహ్రా ఆదిలాబాబ్, విశాఖ రూరల్‌ జిల్లాల్లో ఎస్పీగా పని చేశారు. గ్రేహౌండ్స్‌లోనూ కొంతకాలం బాధ్యతలు నిర్వర్తించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఇతర అధికారులకు ఇచ్చినట్లు తనకు ‘Y' కేటగిరీ రక్షణ కల్పించాలని జగన్‌ ప్రభుత్వానికి మెహ్రా 3 లేఖలు రాసినా స్పందించలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ పోస్టును భర్తీ చేస్తే ఆ ప్రక్రియలో కేంద్రానికి పంపే జాబితాలో ఉండాల్సిన సీనియార్టీ సంతోష్‌ మెహ్రాది. అలాంటి అధికారిని జగన్‌ ప్రభుత్వం దారుణంగా అవమానించింది. ఈ వ్యవహారాలపై ఆయన్ను స్పందించాలని కోరగా అప్పుడు జరిగిన వాటిపై ఇప్పుడు మాట్లాడనని సమాధానం ఇచ్చారు.

సెంట్రల్​ జైల్లో పిన్నెళ్లితో జగన్​ ములాఖత్​ - ఏం సందేశం ఇస్తున్నారంటూ నెటిజన్ల ట్రోల్స్​ - YS Jagan Meet Pinnelli

ABOUT THE AUTHOR

...view details