ETV Bharat / spiritual

జాతకంలో కాలసర్ప దోషం - ఈ పరిహారాలు పాటిస్తే తొలిగిపోతాయట! - REMEDIES FOR KAAL SARP DOSH

-జాతకంలో కాలసర్ప దోషాలతో అనేక సమస్యలు -ద్వాదశ రాశుల వారికి పరిహారాలు సూచిస్తున్న జ్యోతిష్యులు

Remedies for Kaal Sarp Dosh
Remedies for Kaal Sarp Dosh (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2025, 4:38 PM IST

Remedies for Kaal Sarp Dosh: జాతకంలో దోషాలు ఉండడం సాధారణమే. మన జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే దాని ప్రభావం మనపై కచ్చితంగా ఉంటుంది. అయితే, దోషాలలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. అందులో కాలసర్ప దోషం కూడా ఒకటి. జ్యోతిష్యం ప్రకారం ఇది అత్యంత ప్రభావవంతమైన దోషం. ఈ దోషాన్ని పోగొట్టుకోవాలనుకునే వారు కొన్ని పరిహారాలు పాటిస్తే మంచిదని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ సూచిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కాలసర్ప దోషాలు ఉంటే ఏం జరుగుతుంది?: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 144 రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయని మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. అందులో 12 ముఖ్యమైనవని అంటున్నారు. 100 మందిలో సుమారు 80 మంది జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉంటుందని వివరిస్తున్నారు. ఈ దోషం ఉంటే ఏం చేసినా అదృష్టం కలిసి రాదని, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, చేస్తున్న పనుల్లో ఆటంకాలు వంటివి ఎదురవుతాయని అంటున్నారు. అయితే ఏ రకమైనటువంటి కాలసర్ప దోషాలు ఉన్నా వాటిని సంపూర్ణంగా పోగొట్టేందుకు జన్మ లేదా నామ రాశిని బట్టి కొన్ని పరిహారాలు పాటించాలని చెబుతున్నారు.

కాలసర్ప దోషాలు ఉంటే ద్వాదశ రాశుల వారు చేయాల్సిన పరిహారాలు:

మేష రాశి: ఈ రాశి ఉన్న వారికి కాలసర్ప దోషాలు ఉంటే ఆవ నూనెతో చేసిన పదార్థాలను వీలైనప్పుడు కుక్కలకు ఆహారంగా వేస్తుండాలని చెబుతున్నారు. అలాగే పక్షులకు గింజలు కూడా వేస్తుండాలని సూచిస్తున్నారు.

వృషభ రాశి: ఈ రాశి వారు జపమాలికలలో ఉండే చందనపు మాలికను మెడలో ధరించడం వల్ల కాలసర్ప దోషం నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ఆవనూనెతో తయారైన పదార్థాలను ఎవరికైనా పంచిపెడితే మంచి జరుగుతుందని చెబుతున్నారు.

మిథున రాశి: ఈ రాశి కలిగిన వారు పక్షులకు గింజలు ఆహారంగా వేయాలని చెబుతున్నారు. అలాగే గణపతిని గరికతో పూజించడం వల్ల కూడా ఈ దోషం నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు దుప్పట్లను మీ చేతుల మీదుగా దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. అలాగే పుట్టలో పాలు పోయడం వల్ల కూడా ఈ దోషాలు తొలగిపోతాయని వివరిస్తున్నారు.

సింహ రాశి: ఈ రాశిలో పుట్టిన వారికి కాలసర్ప దోషం తొలగిపోవాలంటే కుక్కలకు మినప గారెలు ఆహారంగా పెట్టాలని చెబుతున్నారు. అలాగే వీలైనప్పుడుల్లా శని లేదా ఆదివారం నాడు సూర్యనమస్కారం చేసి నీళ్లలో పాలు కలిపి వాటిని రావి చెట్టుకు పోస్తే దోషాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు.

కన్య రాశి: కాలసర్ప దోషాలు తొలగించుకునేందుకు ఈ రాశిలో పుట్టిన వారు దర్భ మాలిక ధరించాలని సూచిస్తున్నారు. అదే విధంగా కుక్కలకు తీపి పదార్థాలను ఆహారంగా వేసినా మంచి జరుగుతుందని వివరిస్తున్నారు.

తులా రాశి: ఈ రాశిలో పుట్టిన వారు పక్షులకు ఆహారంగా గింజలు వేయాలని పేర్కొంటున్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్​ చాలీసా పారాయణం విన్నా ఈ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.

వృశ్చిక రాశి: ఈ రాశిలో జన్మించిన వారు గణపతికి లడ్డూలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించినా, ఇతరులకు పంచిపెట్టినా కాలసర్ప దోషాల నుంచి బయటపడతారని చెబుతున్నారు. చిన్న పిల్లలకు చెరకు ముక్కలు పంచిపెట్టినా ఈ రాశి వారికి మంచి జరుగుతుందని వివరిస్తున్నారు.

ధనస్సు రాశి: కాలసర్ప దోషాలు తొలగించుకునేందుకు ఈ రాశి వారి ఎండు కొబ్బరి ముక్కలను షిర్డీ సాయి బాబా ఆలయంలోని దునిలో వేయాలని, ఇలా చేయడం వల్ల ఈ దోషాల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చని చెబుతున్నారు. అలాగే తాలింపు పెట్టిన శనగలను ఏదైనా దేవాలయం దగ్గర పంచిపెట్టినా మంచి జరుగుతుందని సూచిస్తున్నారు.

మకర రాశి: మకరంలో జన్మించిన వారు కుదిరినప్పుడల్లా శివాలయ ప్రాంగణంలో నువ్వుల నూనె దీపం వెలిగించాలి. అలాగే ఆవుపేడతో తయారైన విభూదిని నుదిటిన ధరించాలని సూచిస్తున్నారు.

కుంభ రాశి: నీటి కుండలను ఎవరికైనా దానం ఇవ్వడం వల్ల కుంభ రాశి వారి కాలసర్ప దోషం నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.

మీన రాశి: ఈ రాశి కలిగిన వారు జన్మ నక్షత్రం ఉన్న రోజు దేవాలయంలో అన్నదానం చేసినా లేదా ఎవరికైనా వస్త్రదానం చేసినా కాలసర్ప దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చని చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

"మీరు పని మొదలు పెట్టే ముందు - శుభానికి సూచికైన పసుపుతో ఇలా చేయండి - సక్సెస్ గ్యారెంటీ"

జ్యోతిష్యశాస్త్రం కీలక సూచన - హెయిర్ కటింగ్, షేవింగ్ - ఈ రోజుల్లో అస్సలే చేయించవద్దట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.