AP CM Jagan Comments On YS Sharmila Saree :ఆంధ్రప్రదేశ్సీఎం జగన్ తాజాగా పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో సొంత చెల్లి, ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై చేసిన విమర్శలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పసుపు చీర కట్టుకుని, వైఎస్ శత్రువులకు ఆహ్వానించారంటూ సీఎం జగన్, షర్మిలపై విమర్శల వర్షం కురిపించారు. నిజానికి షర్మిల తన కుమారుడు రాజా వివాహాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరిలో ఆమె పలువురు అగ్రనేతలను వారి ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు.
షర్మిల కట్టుకున్న చీరపై జగన్ కామెంట్లు: షర్మిల తన కుమారుడు వివాహ ఆహ్వానంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఆమె హైదరాబాద్ నివాసంలో కలుసుకున్నారు. కుమారుడి వివాహ పత్రికను ఇవ్వడంతోపాటు స్వీట్లు, కానుకలు కూడా ఇచ్చారు. ఈ సమయంలో ఆమె లైట్ ఎరుపు రంగు బార్డర్ ఉన్న పసుపు రంగు చీరను ధరించారు. ఇది అనుకుని చేశారో, లేదా యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు. ఎవరూ కూడా దీనిపై ఇప్పటి వరకు కామెంట్లు చేయలేదు. ఇది సభ్యత కూడా కాదని అందరికీ తెలిసిందే. కానీ, తాజాగా సీఎం జగన్, ఇదే చీరపై కామెంట్లు చేశారు. పసుపు రంగు చీర కట్టుకుని, వైఎస్ శత్రువులకు ఆహ్వాన పత్రికలు అందించారంటూ నాటి ఘటనను పులివెందుల రాజకీయ సభలో తెరపైకి తీసుకొచ్చారు.
ఏపీలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల రాళ్లదాడి - తిరుపతిలో ఉద్రిక్తత
స్పందించిన వైఎస్ షర్మిల:తాను కట్టుకున్న చీర గురించి రాజకీయ వేదికపై జగన్ సభలో మాట్లాడటం దారుణంమని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. సొంతచెల్లెలు వేసుకున్న బట్టలపై వేల మంది సభలో మాట్లాడుతారా? మీద ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు! ఇంత దిగజారుడు రాజకీయాలు ఏం అవసరం ఉంది?. నా వొంటిమీద ఉన్న బట్టలు గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా ? అంటూ తీవ్ర స్థాయిలో జగన్పై విరుచుకుపడ్డారు.