YOUTH KILLED IN THE NAME OF MARRIAGE: ఇంటి ముందు కూర్చున్న ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేసిన ఘటన హైదరాబాద్లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. కేసు వివరాలను ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్సై శివశంకర్ వెల్లడించారు. ఓల్డ్ బోయిన్‌పల్లి అలీ కాంప్లెక్స్ దగ్గరలో నివసించే మహమ్మద్ సమీర్ (25) వెల్డింగ్ పని చేస్తుంటాడు.
అస్సాంకు వెళ్లి ప్రేమ వివాహం: గత సంవత్సరం నాచారంలో ఓ భవనానికి సంబంధించి వెల్డింగ్ పని చేయడానికి వెళ్లిన సమీర్ అదే బిల్డింగ్ యజమాని కుమార్తెను ప్రేమించాడు. ఆ అమ్మాయిని తీసుకొని ఈ సంవత్సరం జనవరిలో అస్సాంకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ అక్కడే 20 రోజులపాటు ఉన్నారు.
పెళ్లి చేస్తామంటూ నమ్మించి:ఈ వివాహం ఇష్టం లేది అమ్మాయి కుటుంబసభ్యులు, వారికి వివాహం చేస్తామటూ నమ్మించారు. వారిని హైదరాబాద్ వచ్చేలా చేశారు. అనంతరం అమ్మాయిని తీసుకెళ్లి ఆమెకు మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేశారు. దీనిని సమీర్ అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.