Aadi Saikumar Shambala Movie : వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు యంగ్ హీరో ఆది సాయి కుమార్. ఇప్పుడు ఆయన మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యుగంధర్ ముని దర్శకత్వంలో ఇప్పుడు ఆయన నటిస్తోన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'శంబాల'. అర్చన అయ్యర్ కథానాయికగా నటించింది.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఆది పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలో ఆది పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుందని, ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని మూవీ టీమ్ చెబుతోంది.
కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాల్ని చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారని తెలిపింది. 'శంబాల'లో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని సరికొత్త పాయింట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
#Shambala pic.twitter.com/PKyHkktndX
— Aadi Saikumar (@iamaadisaikumar) December 23, 2024
'డాకు మహారాజ్' కోసం మూడు భారీ ఈవెంట్‌లను ప్లాన్ చేశాం : నిర్మాత నాగవంశీ
'స్క్విడ్ గేమ్' టు 'బేబీ జాన్' - ఈ వారం థియేటర్ / ఓటీటీలో అలరించనున్న టాప్ కంటెంట్ ఇదే!