Young Man Kidnapped And Raped A Minor Girl Who Met On Instagram in Adilabad : ఓ మైనర్ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో యువకుడు పరిచయం అయ్యాడు. అనంతరం మైనర్‌ను అపహరించి అత్యాచారం చేసిన ఘటన ఆదిలాబాద్ పట్టణంలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఆదిలాబాద్‌లోని ఓ మెడికల్ కాలేజ్‌లో విద్యను అభ్యసిస్తున్న బాలిక (17)కు ఇన్‌స్టాగ్రామ్‌లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులకు చెందిన శివ (22) అనే యువకుడు పరిచయం అయ్యాడు.
శివ బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె ఈ నెల 9న సికింద్రాబాద్‌కు వెళ్లి శివని కలుసుకుంది. అనంతరం ఆ యువకుడు బాలికను ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు. బాలిక మెడికల్ కాలేజ్‌లో కనిపించకపోవడంతో సిబ్బంది విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయగా బాలిక ఆచూకీ తెలుసుకున్న పోలీసులు ఆమెను ఆదిలాబాద్‌కు రప్పించారు.