ETV Bharat / international

'8నెలల జీతం ఇస్తాం, రిజైన్​ చేసి వెళ్లిపోండి'- 20లక్షల మంది ఉద్యోగులకు ట్రంప్ మెయిల్! - TRUMP ON FEDERAL WORKERS

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల్లో కోతకు ట్రంప్ మెమో జారీ- 20 లక్షల మంది ఉద్యోగులకు ఈమెయిల్- ఫిబ్రవరి 6లోగా నిర్ణయం తీసుకోవాలని నిర్దేశం

Trump On Federal Workers
Donald Trump (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2025, 12:02 PM IST

Trump Federal Workforce Cuts : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా బైఅవుట్‌ను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన, అనుకూలతలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఆఫీస్‌ ఆఫ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ఒక మెమోను జారీ చేశారు. దీనిపై ఒక ఈ మెయిల్‌ కూడా 20 లక్షల మంది ఉద్యోగులకు అందింది.

వాళ్లకి ఒకేసారి 8 నెలల జీతం
స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకుంటే ఎనిమిది నెలల వేతనాన్ని ఏకకాలంలో చెల్లిస్తారనేది ఆ మెమో, ఈ మెయిల్‌ల సారాంశం. దీనిపై వచ్చే వారం (ఫిబ్రవరి 6)లోగా ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వ ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగాలు మానేద్దామని భావించేవారు ఈ ఆఫర్‌ను ఎంచుకోవచ్చని తెలిపారు. ఈ వివరాలను అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ' (డోజ్) సలహా మండలి సభ్యుడు కేటీ మిల్లర్ ధ్రువీకరించారు. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

రిమోట్‌ విధానంలో పని చేసేవారిపై ఫోకస్
కరోనా సంక్షోభ కాలం తర్వాత చాలామంది ఉద్యోగులు రిమోట్‌ విధానంలో పని చేస్తున్నారు. వారంతా వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రావాల్సిందే అని ట్రంప్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆఫీసుకు వచ్చి ఉద్యోగం చేయడం ఇష్టంలేని వారు బైఅవుట్‌ ఆఫర్‌ను వినియోగించుకోవాలని నిర్దేశించింది. దాదాపు 10-15 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఆఫర్‌ను ఎంచుకుంటారని అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయితే అమెరికా ప్రభుత్వ వార్షిక ఖర్చులు ఏటా 100 బిలియన్‌ డాలర్ల దాకా తగ్గుతాయని అంటున్నారు. ఓవైపు అమెరికా ప్రభుత్వం నుంచి నిధుల విడుదలను, రుణాల మంజూరును నిలిపివేసిన వేళ బైఅవుట్ ఆఫర్‌పై ట్రంప్ ప్రకటన చేయడం గమనార్హం. అమెరికాలోని పలు స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలపై ఈ నిర్ణయాల ప్రభావం ఉంటుంది.

ఆ ఉద్యోగుల సంఖ్య తగ్గింపు
గతేడాది చివరి నాటికి అమెరికాలో దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. దేశంలోని అన్ని రంగాల ఉద్యోగుల్లో ఇది 1.9శాతానికి సమానం. ప్యూ రీసెర్చ్ సెంటర్‌ గణాంకాల ప్రకారం ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి సగటున 12 ఏళ్లపాటు పని చేస్తాడు. తాజాగా ట్రంప్‌ ఆఫర్‌ను కొద్ది మంది ఆమోదించినా, అది అమెరికా పాలనా వ్యవస్థ, ఆర్థికవ్యవస్థలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రత్యేకించి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, నీటి పరీక్షల విభాగం, వైమానిక రంగం, నిత్యావసర వస్తువుల రక్షణకు సంబంధించిన ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.