wives who killed their husbands In Suryapet : వావివరుసలు మరచి, కన్న కుమార్తెనే లైంగికంగా వేధిస్తున్న కామాంధుడిని ఇద్దరు భార్యలు ఒక్కటై కడతేర్చారు. కుమార్తె పట్ల వక్రబుద్ది చేష్టలతో ఆవేదనతో ఆత్మహత్యకు సిద్ధపడి, చివరి క్షణంలో అతడినే అంతమొందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భార్యలు భర్తను రోకలి బండతో కొట్టి చంపారు. మండలంలోని ఓ తండాకు చెందిన వ్యక్తి (43) డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిని (అక్క, చెల్లి) ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కూమార్తెలు, ఓ కుమారుడు సంతానం. కొన్ని రోజుల నుంచి పరాయి స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం.