కింది నుంచి పైకి ప్రవహిస్తున్న నీరు-శాస్త్రవేత్తలకే ప్రశ్నార్థకంగా మారిన వింత ఘటన! Water Flows In Reverse Direction : సాధారణంగా నీరు పైనుంచి కిందకు ప్రవహించడం ప్రకృతి ధర్మం. అయితే ఓ గ్రామంలో మాత్రం నీరు కాలువల రూపంలో ఎత్తైన ప్రదేశాలకు ప్రవహిస్తోంది. దీంతో ఈ ఘటన ఆ ప్రాంత వాసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వింతను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు తరలివస్తున్నారు. దీనిని స్థానికులు 'మినీ కశ్మీర్‌గా' పిలుచుకుంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అంబికాపూర్ జిల్లాలో మెయిన్‌పాట్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో బండరాయి కింది నీరు వస్తూ రెండు కిలోమీటర్ల ఎత్తైన ప్రదేశంలోకి ప్రవహిస్తుంది. అలా చివరకు ఓ వాటర్ ఫాల్లో కలుస్తోంది. ఎక్కడైనా నీరు ఎగువ నుంచి దిగువకు ప్రవహిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం రివర్స్‌లో ప్రవహిస్తుండటంతో చూపరులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేకపోయారు :ఈ విధంగా నీరు కింది నుంచి పైకి ఎందుకు ప్రవహిస్తోందో శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేకపోయారు. భూమికి ఉన్న గ్రావిటీ వల్లే ఈ విధంగా జరుగుతుందని కొందరు అంటున్నారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగితే కానీ, కారణం బయటపడేలా లేదు. ఈ వింత ఘటన గురించి ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న ఇతర ప్రాంతాల వారు కూడా ఈ విచిత్రాన్ని చూసేందుకు మెయిన్‌పాట్ గ్రామానికి తరలివస్తున్నారు. ఈ వింత ఘటనను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అక్కడి అద్భుత దృశ్యాలు అందరినీ కనువిందు చేస్తున్నాయి.
Mini Kashmir in Chhattisgarh :ఈ ప్రాంతాన్ని ఛత్తీస్‌గఢ్ వాసులు 'మినీ కశ్మీర్‌గా' పిలుచుకుంటున్నారు. నీరు ఎగువకు ప్రవహిస్తున్న ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల ఇక్కడ చలి అధికంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. నీరు ఎత్తైన ప్రాంతాలకు ప్రవహించడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని, దీనిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు చెబుతున్నారు. నిజంగా మనం ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా చూస్తుంటాం. ఈ ప్రపంచమే ఒక దృగ్విషయం. ఇందులో ప్రతిదీ అద్భతమే. ఎందుకు ఇలా జరుగుతుందనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.