KTR Demands To Implement BC Declaration:అసెంబ్లీలో పద్దులపై చర్చలో భాగంగా పలు అంశాలపై మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య ఆసక్తి కర చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పదేళ్లపాటు ఏమీ చేయలేదనడం భావ్యం కాదని కేటీఆర్ తెలిపారు. బీసీ డిక్లరేషన్ ప్రకారం లక్ష కోట్లు అన్నారని, బడ్జెట్‌లో మాత్రం 20వేల కోట్లు కూడా పెట్టలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తారా? లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
కేటీఆర్ ప్రశ్నలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ స్పందించారు. బీసీల పట్ల తమ చిత్తశుద్దిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ లాగా తక్కువ రిజర్వేషన్లు ఇవ్వబోమని స్పష్టంచేశారు. బీసీల గురించి మాట్లాడే కేటీఆర్ పార్టీలో బీసీలకు స్థానం ఉందా? అని ప్రశ్నించారు. వర్కింగ్ ప్రెసిడెంట్, ఎల్పీ లీడర్, ప్రతిపక్ష నేత, అన్నీ వారే అయితే బీసీలు ఎక్కడ అని అడిగారు. బీసీల గురించి మాట్లాడి కేటీఆర్ వాళ్ల పార్టీలో ముందు న్యాయం చేయాలని పొన్నం అన్నారు. బీసీ కేటాయింపులకే కాదు, పని చేసి చూపిస్తామని చెప్పారు.
పవర్ వార్ : అసెంబ్లీ వేదికగా విద్యుత్ రంగంపై అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ చర్చ - electricity debate in assembly 2024
బీఆర్ఎస్ లాగా పంచాయతీ ఎన్నికల్లో తాము బీసీలకు తక్కువ రిజర్వేషన్లు ఇవ్వబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ పద్దుపై బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ లేవనెత్తిన అంశాలకు మంత్రి వివరణ ఇచ్చారు. ఆరోపణల విషయంలో సభాపతి రూలింగ్ ఇవ్వాలన్న కేటీఆర్, యూనిఫైడ్ కార్డు కోసం ఒక ప్రయత్నం చేశామని, ఎందుకో కానీ ఆర్టీసీ ఎండీ మూడు నెలల తర్వాత రద్దు చేశారని పేర్కొన్నారు.
ఫార్మాసిటీ రద్దు చేస్తే భూములు తిరిగి వెనక్కు ఇస్తామని గతంలో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోదండరెడ్డి హామీ ఇచ్చారని, భూములు రైతులకు వెనక్కు ఎప్పుడు ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ అభివృద్ది కోసం ఒకరోజు 50 వేల కోట్లు, మరొక రోజు 70 వేల కోట్లు, ఇపుడు లక్షా 50 వేల కోట్లు అంటున్నారని, 16 వేల కోట్లతో మేము ప్రతిపాదించిన ప్రాజెక్టు లక్షా 50 వేల కోట్లు ఎందుకు అవుతోందని అడిగారు. రైతుల అభిప్రాయాల మేరకే ఫార్మా సిటీ విషయమై గతంలో చెప్పామన్న మంత్రి శ్రీధర్ బాబు, మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై డీపీఆర్ తయారీ కసరత్తు జరుగుతోందని తెలిపారు.
ఎమ్మార్ ప్రాజెక్టు భూసేకరణపై హైకోర్టు కీలక తీర్పు - రిజిస్ట్రేషన్, లీజు ఒప్పందాలు రద్దు - High Court On Mr Project Land