Egg Noodles Recipe in Telugu : ఎగ్ నూడుల్స్ అంటే ఇష్టపడని వారుండరు. ఇక పిల్లలైతే.. ప్లేట్లో నూడుల్స్ వేసి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా.. అప్పటికప్పుడు చేసే ఫుడ్ ఐటమ్స్‌లో ఒకటైన ఎగ్ నూడుల్స్.. అందరి ఫేవరెట్ లిస్ట్‌లోకి చేరిపోయింది. అయితే.. రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నూడుల్స్ తింటే టేస్ట్ అద్దిరిపోతుంది కానీ, తరచూ బయట నూడుల్స్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. ఇంట్లోనే ఆ టేస్ట్ వచ్చే విధంగా చేసుకుంటే బెటర్. మరి ఇక ఆలస్యం చేయకుండా స్ట్రీట్ స్టైల్ యమ్మీ ఎగ్ నూడుల్స్ ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
- నూడుల్స్- ప్యాకెట్ (140 గ్రాములు)
- ఎగ్స్-4
- నూనె - సరిపడా
- సోయా సాస్ - ఒక టేబుల్‌స్పూన్
- వెనిగర్ - ఒక టేబుల్‌స్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- క్యాబేజీ తురుము - అరకప్పు
- క్యాప్సికం తురుము- పావుకప్పు
- క్యారెట్ - ఒకటి
- ఉల్లిపాయ - ఒకటి
- కారం-టీస్పూన్
- మిరయాలపొడి-అర టీస్పూన్
- గరం మసాలా -అర టీస్పూన్
తయారీ విధానం:
- ముందుగా ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికం, క్యాబేజీని సన్నగా కట్ చేసుకోవాలి.
- ఆపై నూడుల్స్ ఉడికించుకోవడం కోసం స్టౌపై గిన్నె పెట్టి నీళ్లు పోయాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి నీరు బాగా మరగనివ్వాలి. నీరు మరుగుతున్నప్పుడు నూడుల్స్ వేసి కలపాలి.
- నూడుల్స్ 80 శాతం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయండి.
- ఆపై ఇందులో చల్లటి వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేయండి. దీనివల్ల నూడుల్స్ మరీ మెత్తగా కుక్ అవ్వకుండా ఉంటాయి.
- 5 నిమిషాల తర్వాత నూడుల్స్‌ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ వేసి కలపాలి.
- తర్వాత చిన్నగిన్నెలో ఎగ్స్ పగలగొట్టాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా బీట్ చేయాలి.
- ఇప్పుడు స్టౌపై ఒక కడాయి పెట్టండి. ఇందులో 3 టేబుల్స్పూన్ల ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయండి. తర్వాత బీట్ చేసిన ఎగ్ మిశ్రమం వేయండి.
- ఎగ్ ఆమ్లెట్ తయారైన తర్వాత.. చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి.
- తర్వాత క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం తరుగు, క్యాబేజీ తరుగు, ఉప్పు వేసి బాగా కలపండి.
- స్టౌ హై ఫ్లేమ్‌లో పెట్టి కూరగాయలు 2 నిమిషాలు వేయించుకోండి.
- ఇప్పుడు ఉడికించుకున్న నూడుల్స్ వేసి కలపండి. ఆపై కారం, మిరయాలపొడి, గరం మసాలా వేసి కలపండి.
- తర్వాత వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి మిక్స్ చేయండి. ఆపై నూడుల్స్‌పై కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
- యమ్మీ యమ్మీగా ఉండే టేస్టీ ఎగ్ నూడుల్స్ మీ ముందుంటాయి.
- నచ్చితే స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడుల్స్ ఇలా ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
క్రిస్పీ అండ్ టేస్టీ "తోటకూర గారెలు" - ఇలా చేశారంటే టేస్ట్ అదుర్స్!
సూపర్ స్నాక్ రెసిపీ : కరకరలాడే "పోహా ఫింగర్ బైట్స్" - ఇలా చేసి పెడితే పిల్లలు ఒక్కటీ మిగల్చరు!