Khammam Student Died in Firing in USA : అమెరికాలోని చికాగోలో దుండగులు జరిగిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన సాయితేజ అనే యువకుడు మృతి చెందాడు. ఖమ్మం నగరం రాపర్తినగర్ రమణగుట్ట రోడ్డులోని రామన్నపేటకు చెందిన 26 ఏళ్ల నూకరపు సాయితేజ ఎం.ఎస్ చదివేందుకు 4 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. దుండగులు ఎందుకు కాల్చి చంపారనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
