ETV Bharat / state

ఈసారికి ఇంటర్నల్ మార్కులకు ఓకే - నెక్స్ట్ ఇయర్ నుంచి 100 మార్కులకు ఎగ్జామ్ - INTERNAL MARKS FOR 10TH EXAMS

వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంటర్నల్ మార్కుల తొలగింపు - ప్రస్తుతం గ్రేడింగ్​ విధానం మాత్రమే ఎత్తివేత - తాజాగా మరోసారి జీవోను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Telangana Govt on Tenth Exams
ternal Marks for Tenth Exams (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2024, 10:23 AM IST

Updated : Nov 30, 2024, 1:01 PM IST

Telangana Govt continues Internal Marks for Tenth Exams : పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల తొలగింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్నల్ మార్కులు కొనసాగించనున్నట్లు ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి రాత పరీక్షలకు 100 మార్కుల విధానం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు తాజాగా మరో జీవోని విడుదల చేసింది. గురువారం ఇంటర్నల్ మార్కులతోపాటు గ్రేడింగ్​ విధానాన్ని తొలగిస్తున్నట్టు సర్కారు జీవో విడుదల చేసింది. అయితే పది పరీక్షలకు మరో 3 నెలల సమయం మాత్రమే ఉన్నప్పుడు ప్రభుత్వం 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల విమర్శలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే గ్రేడింగ్​ విధానం మాత్రం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఎత్తవేయనున్నారు. అంటే గ్రేడింగ్​కు బదులు మార్కులు కేటాయిస్తారు. ఇక నుంచి ఆరు సబ్జెక్టుల పరీక్షలకు 600 మార్కులు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.50 లక్షల మంది పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ఫైనల్​ ఎగ్జామ్స్​కు మూడున్నర నెలల ముందు ఉండగా మార్కుల విధానం మార్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మార్కుల విధానంపై నిర్ణయం తీసుకుని ఇంటర్నల్​ మార్కులను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. రాష్టంలో దీన్ని 2011 నుంచి అమలు చేస్తున్నారు. ఆ ప్రకారం ఇంటర్నల్​ పరీక్షలకు(ప్రాజెక్టులు, రాతపనికి) 20 మార్కులు, వార్షిక పరీక్షలకు 80 మార్కులు ఇస్తున్నారు.

ప్రభావం ఇలా : ఇప్పటివరకు గ్రేడింగ్​ పద్ధతి ఉండటంతో పరీక్షల ఫలితాల తర్వాత కొంత మంది విద్యార్థులు మాత్రమే పునఃలెక్కింపునకు, పునర్‌మూల్యాంకనం దరఖాస్తు చేశారు. కనీసం తొమ్మిది మార్కులైనా కలిస్తే తప్ప గ్రేడ్​ పెరగదని భావించిన విద్యార్థులు, పునర్‌మూల్యాంకనానికి ఆసక్తి చూపించ లేదు. ఉదాహరణకు ఏ సబ్జెక్టులోనైనా 80 నుంచి 90 మధ్య మార్కులు వస్తే ఏ2 గ్రేడ్​ ఇస్తారు. ఏ1 గ్రేడ్​గా మారాలంటే విద్యార్థికి కనీసం 90 నుంచి 100 మార్కులు రావాలి.

ఆరు నుంచి తొమ్మిదో 9 తరగతుల్లో కూడా అంతర్గత మార్కు(20)ల పద్ధతి అమలవుతోంది. ఇక 1 నుంచి ఐదో తరగుతులకు కూడా 50 మార్కులకు అంతర్గత పరీక్షలు, 50 మార్కులకు చివరి పరీక్షలు ఉంటాయి. కాగా ఆ తరగతులపై ఇప్పటివరకు విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో భారీ మార్పులు

Last Updated : Nov 30, 2024, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.