ETV Bharat / entertainment

డిసెంబర్​ తొలి వారం 'పుష్ప'దే - క్రిస్మస్​ కానుకగా 12 చిత్రాలు! - DECEMBER MOVIES 2024

డిసెంబర్​ నెలలో రానున్న క్రేజీ సినిమాలు ఇవే - మీ ఛాయిస్ ఏంటి?

December Movies 2024
December Movies 2024 (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2024, 10:43 AM IST

December Movies 2024 : నవంబర్ ముగిసింది. డిసెంబర్ వచ్చేసింది. అయితే ఈ నెలలో తొలి వారం 'పుష్ప 2' గాడి రూల్​తో బాక్సాఫీస్ దగ్గర సందడి ఉంటుంది. ఆ తర్వాత క్రిస్మస్‌ను పురస్కరించుకుని వరుసగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సారి ఈ డిసెంబర్​ నెలలో రిలీజ్ కానున్న చిత్రాలేంటో తెలుసుకుందాం.

మొదటి వారం 'పుష్ప'నే(Pushpa 2 Release Date)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ 'పుష్ప 2'తో దాదాపు మూడేళ్ల తర్వాత వెండితెరపై సందడి చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబరు 5న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఆరు భాషల్లో 12 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Fear Movie Release Date : హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఫియర్‌. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులను కూడా గెలుచుకుంది. డిసెంబరు 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఆ తర్వాత, క్రిస్మస్‌ సందర్భంగా ఏకంగా 11 చిత్రాలు విడుదల కానున్నాయి.

మహేశ్‌బాబు వాయిస్‌తో ముఫాసా - ది లయన్‌ కింగ్‌కు ప్రీక్వెల్​గా ముఫాసా : ది లయన్‌ కింగ్‌ (Mufasa: The Lion King) రానుంది. ముఫాసా పాత్రకు మహేశ్‌బాబు వాయిస్‌ అందించారు. డిసెంబరు 20న తెలుగులో ఇది రానుంది.

Bachhala Malli Release Date : అల్లరి నరేశ్‌ యక్షన్‌ మూవీ బచ్చలమల్లి, 1990 నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కింది. నరేశ్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా కనిపించారు. సుబ్బు మంగదేవి డైరెక్టర్​. అమృత అయ్యర్‌ హీరోయిన్​గా నటించింది. డిసెంబరు 20న సినిమా రిలీజ్ కానుంది.

మరో వినూత్న కథతో ఉపేంద్ర : ఎ, ఉపేంద్ర వంటి భిన్నమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఉపేంద్ర దర్శకుడిగానూ తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. ఆయన తాజా చిత్రం యూఐ(UI Movie) డిసెంబరు 20న రానుంది.

'విడుదలై' సీక్వెల్‌ - సూరి, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విడుదలై' భారీ బ్లాక్ అందుకుంది. ఇప్పుడు దాని సీక్వెల్‌ విడుదల : పార్ట్‌ 2 (Viduthalai Part 2) డిసెంబరు 20న రానుంది. వెట్రిమారన్‌ దర్శకత్వం వహించారు.

Sarangapani Jathakam : మనిషి భవిష్యత్తు అతడి చేతి రేఖల్లో ఉంటుందా? లేక అతడి చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానంగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన సినిమా సారంగపాణి జాతకం. ఇది కూడా డిసెంబరు 20నే రానుంది.

సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్ర పోషించిన ఎర్రచీర : ది బిగినింగ్‌ చిత్రం యాక్షన్, మదర్‌ సెంటిమెంట్​తో రానుంది. సుమన్‌ బాబు దర్శకుడు. డిసెంబరు 20న ఇది ప్రేక్షకులను పలకరించనుంది.

ఇంకా మ్యాజిక్ (డిసెంబరు 21), నితిన్ రాబిన్‌హుడ్‌ (డిసెంబరు 25), వెన్నెల కిశోర్‌ 'శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌' (డిసెంబరు 25), కీర్తి సురేశ్​ తొలి హిందీ చిత్రం బేబీ జాన్‌ (డిసెంబరు 25), పతంగ్‌ (డిసెంబరు 27) రానున్నాయి.

'పుష్ప 2'లో చీరకట్టు సీన్స్​ - ఆసక్తికర విషయం చెప్పిన అల్లు అర్జున్!

డిసెంబర్‌లో అందాల భామల సినిమా జాతర - OTTలోకి రానున్న బడా చిత్రాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.