Vizag CP Ravi Shankar On Drugs Case :సీబీఐ విధి నిర్వహణకు తమ వల్ల ఆటంకం కలగలేదని, తమ కారణంగా సోదాలు ఆలస్యమయ్యాయనడం సరికాదని విశాఖ సీపీ రవిశంకర్ అన్నారు. కంటైనర్‌లో డ్రగ్స్ కేసును పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని, వారు కేవలం డాగ్ స్క్వాడ్ సహకారం కోరితే ఇచ్చామని వెల్లడించారు. కంటైనర్ టెర్మినల్ తమ కమిషనరేట్ పరిధిలోకి రాదని చెప్తూ కస్టమ్స్ ఎస్పీ పిలిస్తే తాము వెళ్లామని పేర్కొన్నారు. విశాఖలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని సీపీ రవిశంకర్ చెప్పారు.
Visakha Port Drug Bust :విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటైనర్ ఉన్నట్లు అందిన సమాచారం కలకలం రేపింది. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ నుంచి కంటైనర్‌లో 25 వేల కిలోల డ్రగ్స్ చేరినట్లు ఇంటర్‌పోల్ సమాచారంతో రంగంలోకి దిగిన దిల్లీ, విశాఖ సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. కంటైనర్‌లో 25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగులు ఉన్నట్లు గుర్తించి తనిఖీలు చేపట్టారు. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈనెల 16న విశాఖ చేరుకున్న నౌక కంటైనర్ దిగుమతి చేసిన తర్వాత తమిళనాడుకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసు - కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు - vizag Drug bust
బ్రెజిల్ నుంచి SEKU4375380 నంబర్ కంటైనర్‌ను సీజ్ చేసినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. LAB 224348 ఓషన్ నెట్ వర్క్ ఎక్ప్రెస్తో సీల్ చేసి ఉన్న కంటైనర్‌లో భారీ ఎత్తున డ్రగ్స్ గుర్తించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. వెయ్యి బ్యాగుల్లో డ్రై ఈస్ట్ ఇందులో ఉన్నట్టుగా కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారని తెలిపింది. అయితే, లాసన్స్ బే కాలనీలో ఉన్న సంధ్యా అక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధుల సమక్షంలోనే సీబీఐ, పోర్టు అధికారులు కంటైనర్‌ను తెరిచి సోదాలు నిర్వహించి నమూనాలు సేకరించారు.