Two Persons Lost Rs.3.81 Crore In Cyber Crime in Patancheru : రెండు రోజుల్లో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.3.81 కోట్లు కొల్లగొట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో చోటుచోసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు సంగారెడ్డి పటాన్చెరు ఏపీఆర్ లగ్జూరియాకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఫేస్బుక్లో నెలన్నర క్రితం స్టాక్ మార్కెట్ పేరిట ఉన్న ఓ ప్రకటన చూసి దాన్ని క్లిక్ చేశాడు. దీంతో అతను సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసిన ఒక వాట్సాప్ గ్రూప్‌లోకి యాడ్ అయ్యాడు.
అనంతరం పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని వారు చెప్పడంతో నమ్మి పెట్టుబడి పెట్టాడు. దీంతో ఒక పోర్టల్ క్రియేట్ చేసి పెట్టుబడి పెట్టినవారికి వచ్చిన లాభాలంటూ అందులో చూపించారు. ఇలా 22 దఫాలుగా ఏకంగా రూ.2.4కోట్లు పెట్టబడిగా పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు, పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటూ కోరడంతో సైబర్ నేరగాళ్లు మొఖం చాటేశారు. బాధితుడు ఎంత అడిగినా స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి తొలుత సైబర్ క్రైమ్ పోలీసులకు, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
"పటాన్చెరు ఏపీఆర్లో ఉండే ఓ వ్యక్తి గత 7వ తేదీనా స్టాక్ మార్కెట్ పేరిట మెసేజ్ రాగా ఓపెన్ చేశాడు. వాట్సాప్‌లో యాడ్ అయ్యాడు. వాళ్లు సూచించిన యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. నిందితులు చెప్పిన విధంగా పెట్టుబడులు పెట్టాడు. ఎక్కవ లాభాలు వస్తున్నాయని నమ్మేసి భారీగా ఇన్వెస్ట్ చేశాడు. బాధితుడు డబ్బులు అడగ్గా మోసపోయాయని గ్రహించి మాకు ఫిర్యాదు చేశాడు." - ప్రవీణ్ రెడ్డి, పటాన్చెరు సీఐ