Two Killed and One Injured In Kukatpally Road Accident :స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి బయటకు వచ్చిన ముగ్గురు బాలురు స్కూటీపై ప్రయాణిస్తూనే సెల్ఫోన్లో రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుడు ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కూకట్పల్లి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారంసూరారం కాలనీ భవాని నగర్‌కు చెదిన సంధ్య ఉదయ్‌కుమార్, సాయిబాబానగ్ వాసి శివదీక్షిత్, మల్లారెడ్డి నగర్‌కు చెందిన మరో బాలుడు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ముగ్గురూ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. శనివారం రోజున మల్లారెడ్డి నగర్‌కు చెందిన బాలుడి పుట్టినరోజు కావడంతో శుక్రవారం అర్ధరాత్రి కేకు కోసి సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత ముగ్గురు ఒకే స్కూటీపై మదాపూర్‌లోని తీగల వంతెన దగ్గరకు బయలుదేరారు. ఉదయ్‌కుమార్ స్కూటీ నడిపాడు. ఫోరంమాల్ మీదుగా హైటెక్‌సిటీ వైపు వెళ్లేందుకు కూకట్పల్లి వైపు వచ్చారు. అయితే రత్నదీప్ సూపర్ మార్కెట్ పిల్లరు నంబరు 822 వద్ద ఓ డీసీఎం రోడ్డు పక్కన ఆగింది.
బైకులు, కార్లతో ప్రమాదకర స్టంట్లు - ఆపై ఇన్‌స్టాలో రీల్స్ - 51 మంది ఆకతాయిల అరెస్ట్ - BIKE RACERS ARREST
రీల్స్ చేస్తూ వాహనం నడిపి :అర్ధరాత్రి 2.18 నిమిషాలకు ముగ్గురు స్కూటీపైనే రీల్స్ చేస్తూ బండిపై ప్రయాణిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆగి ఉన్న డీసీఎంను వెనక నుంచి బలంగా ఢీ కొట్టారు. దీంతో ఉదయ్‌కుమార్, శివదీక్షిత్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రాణాప్రాయస్థితిలో ఉన్న మరో మరో బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. డీసీఎం డ్రైవర్ పక్కన ఆపి ఇండికేటర్ వేసినా ప్రయోజనం లేకుండా పోయిందని పోలీసులు తెలిపారు.
ఇటీవల కాలంలో సెల్ఫీ, రీల్స్ మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. అరె వ్యూ బాగుంది ఓ సెల్ఫీ తీసుకుంటే పోలే అంటూ కొండలపై, గుట్టలపై ఫొటోలు తీసుకుంటూ ప్రమాదాలకు గురవుతున్నారు. రీల్స్ చేసేవారి పరిస్థితీ ఇంతే. జాగ్రత్తలు చూసుకోకుండా ఫాలోయింగ్ పెరగాలని పోకడలకు పోయి ప్రాణాలు పోగోట్టుకుంటన్నారు.
భార్యాభర్తలు ఇద్దరిదీ ఒకేరోజు బర్త్‌డే- ఇప్పుడు డెత్‌డే కూడా ఒకటే- ట్రెక్కింగ్‌కు వెళ్లి మృతి - Uttarakhand Trekking Tragedy
పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా- 13మంది మృతి, మరో 16మందికి గాయాలు - Madhya Pradesh Road Accident