TSSPDCL Work On Gruha Jyothi Date Collection :రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసిన రేవంత్ సర్కార్ మరో రెండు గ్యారంటీలు కార్యరూపం దాల్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. గృహజ్యోతి ఉచిత విద్యుత్(Free Power) అమలుపై విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రత్యేక దృష్టి సారించాయి.
ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరాఫ్ ఫారూఖీతో పాటు అధికారులు సైతం క్షేత్రస్థాయిలో సిబ్బంది నమోదు ప్రక్రియ పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సిబ్బందికి అవసరమైన సలహాలు సూచనలు క్షేత్రస్థాయిలోనే తెలియజేస్తున్నారు. ఏవైనా సందేహాలు వచ్చినా వాటిని క్షుణ్నంగా తీరుస్తున్నారు. అర్హుల నమోదు ప్రక్రియ ఎలా సాగుతుందో అధికారులు స్వయంగా పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరగా గృహజ్యోతి అర్హుల వివరాలను నమోదు చేయాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరాఫ్ ఫారూఖీ అధికారులకు ఆదేశించారు.
అద్దెకు ఉండే వారికీ 'గృహజ్యోతి' వర్తింపు - ముమ్మరంగా వినియోగదారుల వివరాల సేకరణ
200 Units Free Power Scheme : ఎస్పీడీసీఎల్ పరిధిలోని అర్హుల నమెదు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు కోసం మీటర్ రీడర్లు ఇంటింటికి తిరిగి అర్హుల వివరాలు నమోదు చేస్తున్నారు. రేషన్‌కార్డు, ఆధార్, సెల్‌ఫోన్ నంబరు అనుసంధానమై ఉన్న కరెంట్ కనెక్షన్ల ఇళ్లకు తొలిదశలో గృహజ్యోతి(Gruhajyothi) కింద ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.