TSRTC One Day Pass Problem : నేటి తరం యువతలో తమ కళ్ల ముందు ఏం జరిగినా మనకెందుకులే అని చాలా మంది వదిలేసి వెళ్లిపోతుంటారు. ఆ సమస్యపై పోరాటం అనేది చేయరు. కానీ ఈ వృద్ధుడు చేసిన పనికి మాత్రం అతనిని ఆదర్శంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే కానీ ఓ 64 ఏళ్ల వృద్ధుడు మాత్రం అందరిలా అనుకోకుండా, ఇది అందరికీ ఉపయోగపడే అని భావించి దాని గురించి తనకు వృద్ధాప్యం అడ్డొచ్చిన పట్టించుకోకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. తాను అనుకున్నది సాధించుకున్నాడు. ఇంకా ఎవరూ అలాంటి ఇబ్బందులు పడకూడదని దానిపై అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడ్డారు.
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడకు చెందిన తుమ్మల సత్య ఈనెల 26న జీడిమెట్ల బస్సు డిపోలో రూ.100 పెట్టి ఒక్కరోజు పాసును కొన్నారు. ఆ టికెట్ చాలా పెద్దగా ఉండటం, సమయం, తేదీ అస్పష్టంగా ఉండటాన్ని వృద్ధుడు గుర్తించాడు. మరుసటి (రోజు 27న) బస్ భవన్‌కు వెళ్లారు. ఆర్టీసీ సజ్జనార్‌ను కలిసేందుకు ప్రయత్నించగా ఆయన లేకపోవడంతో కార్యాలయంలో అందుబాటులో ఉన్న అధికారులను కలిశారు. వన్ డే పాస్ కోసం ఇచ్చే టికెట్లో తేదీ, సమయం సరిగా లేకపోవడం గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.