Deputy CM Bhatti Vikramarka on Caste Census in Telangana : కలగణన సర్వేలో పాల్గొననివారిలో ఇప్పుడు ఆసక్తి ఉన్నవారు ముందుకొచ్చి సమాచారం ఇస్తే తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించే ప్రక్రియకు సర్వే సమాచారం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కులగణన సర్వే మొదలుపెట్టడానికి సుదీర్ఘ కసరత్తు చేసినట్లు తెలిపారు.
కేవలం వాటి కోసమే వాడుతాం : ఈ సర్వే రాష్ట్ర ప్రజల స్థితిగతులపై ఎక్స్‌రే లాంటిదని భట్టి విక్రమార్క చెప్పారు. కులగణనతో దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. దేశంలోని తొలిసారి కులగణన సర్వేను పూర్తిచేసింది తామే అని అన్నారు. సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. సామాజిక, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల అమలుకు సర్వే సమాచారం వాడతామన్నారు.
కులగణన జరగవద్దని కుట్రదారులు చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి సర్వే జరిగిని తీరును మొత్తం ప్రజలముందు ఉంచుతామన్నారు. వెనుకబడినవర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తోందని భట్టి విక్రమార్క అన్నారు.
వాళ్ల సిఫార్సు ప్రకారమే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ - చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి
అసెంబ్లీలో కులసర్వే నివేదిక ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ - కులాల వారిగా ఎంతమంది ఉన్నారంటే?