Travelling on Bullock Cards To Medaram Jatara : ములుగు జిల్లాలో అత్యంత ఘనంగా జరిగేసమ్మక్క-సారలమ్మ జాతరను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. చాలా మంది బస్సుల్లో, వాళ్ల సొంత వాహనాల్లో లేక రైళ్లలో వస్తారు. కానీ ఈ గ్రామస్థులు మాత్రం కేవలం ఎడ్ల బండిపైనే వస్తాం అంటున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆసియా ఖండంలోనే అత్యంత ఘనంగా జరిగే సమ్మక్క -సారాలమ్మ జాతరకు దేశ వ్యాప్తంగా భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఇప్పటి కాలంలో ఎక్కడికైనా వెళ్లాలి అంటే కారు, బస్సు లేక ఇతర వాహనాలు తీసుకుని వెళ్తున్నారు. పక్క సందులో గుడైనా వాహనాల్లో వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారు. అలాంటిది గిరిజన ప్రాంతంలో ఉండే ఈ జాతరకు 100లో 99 శాతం మంది కార్లు, ఇలాంటి వాటికే ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఈ కాలంలో కూడా ఎడ్లబండిపై వెళ్లేవారుంటారా అంటే అవుననే చెప్పాలి. అందుకు నిదర్శనం ఈ గ్రామస్థులే.
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని పదేళ్లుగా కోరుతున్నాం: సీతక్క
Bullock Cards Special Attraction in Medaram Jatara : సమ్మక్క సారలమ్మ జాతర జరిగినప్పుడల్లా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేంద్రం ప్రజలు ఎండ్లబండి కట్టుకుని వెళ్తారంటా. ఈ విషయమై అడిగితే, పూర్వంలో తాతముత్తాల నుంచి ఈ జాతరకు ఎండ్ల బండి కట్టుకుని ఆచారంగా పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా కలిసి వస్తున్నామని భక్తులు అంటున్నారు. తాము ఇప్పటికీ అదే అనుసరిస్తున్నామని చెబుతున్నారు. మేడారం జాతరఅంటేనే ఎడ్లబండ్ల జాతర అని ఒకప్పుడు ఉండేదని, వరంగల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి కూడా వేలాది మంది భక్తులు ఎడ్ల బండి కట్టుకుని గోదావరి దాటి వచ్చేవారని వివరిస్తున్నారు.