15Years Girl Committed Suicide After Being Scolded By Her Mother : కుట్టు మిషన్ సూది విరగొట్టిందని తల్లి మందలించడంతో 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోచారం ఐటీ కారిడార్ సీఐ బి.రాజు వర్మ తెలిపిన వివరాల ప్రకారం, ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన డోలు కోటయ్య, కవిత దంపతులు జీవనోపాధికి ఘట్కేసర్ మండలం చౌదరిగూడకు వచ్చారు. వీరికి కుమారుడు, ఇద్దరు అమ్మాయిలున్నారు.
రెండో కుమార్తె ఏడో తరగతి చదివి పాఠశాలకు వెళ్లడం లేదు. కుట్టు పని నేర్చుకుంటోంది. శుక్రవారం రాత్రి మిషన్‌కు సంబంధించిన సూది విరగొట్టడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఇంటి సమీపంలోని వారు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కుమార్తెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
ప్రేమ వేధింపులు తాళలేక మైనర్ బాలిక ఆత్మహత్య - Minor suicide Due love harassment
NGOలో దారుణం.. మానసిక దివ్యాంగురాలిపై రేప్.. గర్భం దాల్చిన మైనర్