Trail Run Of First Ever Sea Plane Service in AP :పర్యాటక రంగంలో మరో అద్భుత ఆవిష్కరణకు విజయవాడ వేదిక కానుంది. ఈ నెల 9వ తేదీన పున్నమిఘాట్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14సీట్ల సీ ప్లేన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. విజయవాడ - శ్రీశైలం- విజయవాడ మధ్య సీ ప్లేన్‌ను నడిపేందుకు అనుకూలతలపై నిర్వహించే ఈ ప్రయోగం విజవంతమేతే రాబోయే రోజుల్లో రెగ్యులర్ సర్వీసు ప్రారంభించాలని యోచిస్తున్నారు.
కృష్ణా నదిలో పున్నమిఘాట్ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ జెట్టీకి మెరుగులు దిద్దుతున్నారు. ఇక్కడి నుంచే సీ ప్లేన్ శనివారం బయలుదేరి శ్రీశైలం వెళ్లనుంది. ఇది శ్రీశైలంలోని పాతాళగంగ బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న పాత జెట్టీ వద్ద దిగేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.
నాగార్జునసాగర్ టూ శ్రీశైలం 'లాంచీ ప్రయాణం' షురూ - టికెట్ ధరలు సహా పూర్తి వివరాలివే
మళ్లీ టీడీపీ హయాంలోనే :కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రాన్ని పర్యాటకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల జాతీయస్థాయి డ్రోన్ సమిట్ నిర్వహించారు. ఇప్పుడు సీ ప్లేన్ ప్రయోగం చేస్తున్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో సీ ప్లేన్ కోసం ప్రయోగం జరిగింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో మళ్లీ కదలిక వచ్చింది.
రెండో దశలో తదితర ప్రాంతాల్లో :పౌర విమానయాన మంత్రిత్వశాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కలిసి సీ ప్లేన్ ప్రయోగం చేస్తున్నాయి. విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లన్న ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రయాణం ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని అధికారులు యోచిస్తున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయోగం విజయవంతమయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు అంటున్నారు. విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి తదితర ప్రాంతాల్లోనూ సీ ప్లేన్ల ఏర్పాటుకు రెండో దశలో ప్రయోగాలు చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
పాపికొండలు వెళ్లొద్దామా! - గోదారి అందాలు చూసొద్దామా
కార్తికమాసంలో జ్యోతిర్లింగాలు దర్శించుకునేందుకు వీలుగా - IRCTC సూపర్ ప్యాకేజీ - ధర తక్కువే!