Three Raped the Minor Girl and Made Her Pregnant :కుటుంబ పెద్ద లేదని అమ్మాయిపై కన్నేశారు కామాంధులు. తల్లి పనికి వెళ్లగా బాలిక ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్నారు. అదే అదునుగా తీసుకున్నారు ముగ్గురు యువకులు. బడికి వెళ్తూ, ఆడుకుంటూ సాఫీగా సాగిపోతున్న ఆ బాలికను లోబరుచుకోవాలనుకున్నారు. తల్లి లేని సమయంలో అమ్మాయికి లేనిపోని మాటలు చెప్పారు. అలా అమ్మాయిని నమ్మించిన ముగ్గురు యువకులు ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారానికి పాల్పడి గర్బవతిని చేశారు. ఈ దుర్ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
కుమార్తెను చదివించడానికి కూలీ పని :సిద్దిపేట గ్రామానికి చెందిన 9వ తరగతి బాలిక తండ్రి అనారోగ్యంతో కొంతకాలం క్రితం మరణించాడు. ఈ ఘటనతో ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లింది ఆ కుటుంబం. తన పరిస్థితిలా తన కుమార్తె జీవితం ఆగంకూడదని భావించిన తల్లి, అన్ని తానై వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఎన్ని సమస్యలు ఎదురైనా పనికి వెళ్తూ కుమార్తెను పాఠశాలకు పంపించేది.
ఆడవాళ్లపై క్షణానికో వేధింపులు - నిందితుల్లో మేజర్ భాగం మైనర్లే - Minors in harassment cases
ఆసరగా తీసుకున్న దుర్మార్గులు : తల్లి పనులకు వెళ్లగా కుమార్తె బడి నుంచి వచ్చాక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించారు. దీన్నే ఆసరాగా తీసుకున్నారు ముగ్గురు దుర్మార్గులు. అవకాశం దొరికినప్పుడల్లా అమ్మాయికి మాటమాటలు చెప్పారు. అలా ఆ అమ్మాయి వీళ్లు చెప్పిన మాటలు నమ్మిందని తెలుసుకున్నాక అత్యాచారానికి పాల్పడ్డారు. వేరువేరు సందర్భాల్లో ఒకరికి తెలవకుండా మరొకరు ఒంటరిగా ఉందని తెలుసుకుని లోబరుచుకున్నారు.
అత్యాచారానికి పాల్పడిన నిందితులు (ETV Bharat) కడుపు నొప్పితో బయటపడిన నిజం :ఇటీవల అమ్మాయి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంది. దీంతో చికిత్స నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అమ్మాయి గర్భవతని వెల్లడించారు. ఈ విషయంపై బాలికను తల్లి నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో బాధితురాలు తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఆ ముగ్గురు వ్యక్తులను విచారించగా తామే అత్యాచారం చేసినట్లు అంగీకరించారు. ముగ్గురి నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి మెరుగైన వైద్యం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
తంబళ్లపల్లెలో పరువు హత్య ? - బాలిక మృతదేహాన్ని పొలంలో కాల్చేసిన బంధువులు ! - MINOR GIRL HONOR KILLING IN AP
ప్రేమ వేధింపులు తాళలేక మైనర్ బాలిక ఆత్మహత్య - Minor suicide Due love harassment