తెలంగాణ

telangana

ETV Bharat / state

పని కోసం వచ్చిన బాలికపై రేప్ - ప్రెగ్నెంట్ కావడంతో అబార్షన్ చేయించిన కామాంధుడు - 13 YEARS GIRL RAPE IN HYDERABAD - 13 YEARS GIRL RAPE IN HYDERABAD

Thirteen Year Girl Raped in Hyderabad : ఇల్లు గడవక తండ్రితో పనికి వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ క్రమంలో విషయం బయటకు పొక్కడంతో బాలికకు గర్భస్రావం చేయించాడు. పైగా గ్రామ పెద్దమనుషులతో పంచాయితీ పెట్టించి డబ్బులిచ్చి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడీ ప్రబుద్ధుడు.

Thirteen Year Girl Abortion after Rape
Thirteen Year Girl Raped in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 12:50 PM IST

Thirteen Year Girl Abortion after Rape in Hyderabad : ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు గడవక తండ్రితో కలిసి పనికి వెళ్లిన గిరిజన బాలిక(13)పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. దాదాపు అయిదు నెలలు ఈ నరకాన్ని బాలిక అనుభవించింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చిన విషయం బయటకు పొక్కడంతో ప్రబుద్ధుడు ఆ చిన్నారికి గర్భస్రావం చేయించాడు. పెద్దల మనుషులతో పంచాయితీ పెట్టించి బాధితులకు ఎంతో కొంత డబ్బు ఇచ్చి రాజీ చేయాలనుకున్నాడు. కానీ డబ్బుకు లొంగని ఆ బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.

పనికొచ్చినప్పుడు కన్నేసి ఘాతుకం: విశ్వసనీయ సమాచారం ప్రకారం శంషాబాద్‌ మండలంలోని ఓ తండాకు చెందిన దినసరి కూలీకి పదమూడేళ్ల కుమార్తె ఉంది. అతని భార్య కొన్నేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మరో వివాహం చేసుకున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో తండ్రితోపాటు బాలిక సమీప గ్రామంలోని పలుకుబడి ఉన్న వ్యక్తి భూమిలో వ్యవసాయ పనులకు వెళ్తోంది. ఈ క్రమంలో యజమాని బాలికపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకుని భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. యజమానికి భార్య, కుమారుడు ఉన్నారు. ఇతనికి పలుకుబడి ఉండడంతో బాలిక భయపడి ఎవరికీ చెప్పలేదు.

దీన్ని అవకాశంగా తీసుకున్న ఆ ప్రబుద్ధుడు మళ్లీ పలుమార్లు బాలికపై ఆకృత్యాన్ని కొనసాగించడంతో గర్భం దాల్చింది. దాదాపు అయిదు నెలలు ఈ నరకాన్ని బాలిక అనుభవించింది. తాజాగా ఆమెలో శారీరక మార్పులు కనిపించడంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. దీంతో గర్భం దాల్చిన విషయం చెప్పింది. బాలిక గర్భం దాల్చిన విషయంపై ఆమె కుటుంబ సభ్యులు యజమానిని ప్రశ్నించారు. మీరు(బాలిక కుటుంబ సభ్యులు) ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు. అంతా తాను చూసుకుంటా అంటూ బాలికను కొత్తూరు మండల కేంద్రానికి తీసుకెళ్లాడు. బాలిక ప్రాణానికి ముప్పు ఉంటుందని తెలిసినా ఓ వైద్యురాలికి డబ్బిచ్చి ఒక గదిలో రహస్యంగా గర్భస్రావం చేయించాడు.

పెద్ద మనుషులతో పంచాయితీ :ఈ విషయం బయటకు తెలియడంతో ఆ ప్రబుద్ధుడు తన వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం తండా, గ్రామ పెద్దలను కూర్చోబెట్టి డబ్బులిచ్చి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు. అయితే బాలిక కుటుంబసభ్యులు డబ్బులకు లొంగకుండా మంగళవారం శంషాబాద్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేందర్‌రెడ్డి తెలిపారు.

నిజామాబాద్​లో దారుణం - అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

పోర్న్​ వీడియోలు చూసి బాలికపై అత్యాచారం - ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేసి? - NANDYALA MINOR GIRL RAPE CASE

ABOUT THE AUTHOR

...view details