Thieves Looted Hundi in Nirmal Temple :నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రాజరాజేశ్వరుని ఆలయంలో చోరీ జరిగింది. గర్భగుడి ముందు మండపంలో ఉన్న హుండీని గుర్తు తెలియని ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ తతంగమంతా మండపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రాజరాజేశ్వరుని ఆలయంలో రాత్రి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. గర్భగుడి ముందున్న హుండీలోని డబ్బులను తీసేందుకు ప్రయత్నాలు చేశారు. హుండీ ఎంతకూ తెరుచుకోకపోవడంతో హుండీని బయటి దాకా పట్టుకొని వెళ్లి కారులోని వెనుక డిక్కీలో వేసి తీసుకెళ్తున్నారు. ఇంతలో దేవుడే హుండీని కాపాడుకున్నట్టుగా కారు గుంతలో పడి ఒక్కసారిగా పంక్చర్ అయింది. దీంతో ఏం చేయాలో ఆ దొంగలకు తోచలేదు. టైరు మార్చేందుకు ప్రయత్నాలు చేసినా, అటువైపు నుంచి కొంత మంది వ్యక్తులు రావడంతో భయపడి దొంగలు పారిపోయారు.