తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళ్ల పారాణి ఆరకముందే కాటేసిన కాలం - ఉన్నట్టుండి నవ వధువు మృతి - DEATH OF THE NEW BRIDE AP

పెళ్లైన కొన్ని గంటల్లోనే నవ వధువు మృతి - పుట్టింటి నుంచి వెళ్లిన నవ వధువు సరికొత్త జీవితాన్ని ప్రారంభించేలోపు కాటేసిన విధి

NEW BRIDE DEATH IN AP
కొత్తగా పెళ్లైన నూతన వధువు స్వాతి(21) (ఫైల్​) (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2024, 12:49 PM IST

Both Families in Tragedy :సంతోషంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ కొత్త జీవితాన్ని ప్రారంభించే తరుణంలో విధి కాటేసింది. కాళ్లకు పారాణి ధరించి పుట్టింటి నుంచి వెళ్లిన నవ వధువు సరికొత్త జీవితాన్ని ప్రారంభించేలోపు యమపాశం దూసుకొచ్చి ప్రాణాలు తీసేసింది. ఆ వధూవరులు కన్న కలలను కల్లలు చేసింది. ఈ జంటను ముంచుకొచ్చిన మృత్యువు విడదీసింది. పెళ్లైన మరుసటి రోజే కొన్ని గంటల్లోనే ఆ ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని వైఎస్సార్​ జిల్లా పెద్దముడియం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల మేరకు పెండ్లిమర్రి మండలానికి చెందిన సందల ఓబన్న, ఉత్తమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. రెండో కుమార్తె స్వాతి (21)ని పెద్దముడియానికి చెందిన హేమంత్‌ కుమార్‌కు ఇచ్చి ఈ నెల 17న (ఆదివారం) అంగరంగ వైభవంగా ఆనందోత్సాహాల మధ్య వివాహం జరిపించారు.

ఒక్కసారిగా కుప్పకూలి : సోమవారం (నవంబర్ 18)న తెల్లవారుజామున స్వాతి నిద్రలేచి ఇంటి పని చేసుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయి నేలకొరిగి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మృతికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంపై ఎస్‌ఐ సుబ్బారావును ‘ఈటీవీ భారత్​’ వివరణ కోరగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఒకవేళ ఏదైనా కంప్లైంట్​ వస్తే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. వివాహం జరిగిన ఒక రోజులోనే ఏమైందో తెలియకుండా నూతన వధువు మృతి వార్త ఆ ఊరి గ్రామస్థులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆ యువకుడి పట్ల అందరూ జాలి చూపిస్తున్నారు.

ఆపరేషన్​ వికటించి వివాహిత మృతి.. ఆసుపత్రిపై బంధువుల దాడి

భర్తకు దూరమయ్యానని మనస్తాపం.. వివాహిత ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details