Mother Commits Suicide With Son In Suryapet : 'బావా నన్ను క్షమించు. నాకు చావు తప్పదని తెలుసు. నీతో డాక్టర్ చెబుతుంటే విన్నాను. చావు నాకోసం ఎదురు చూడకుండా నేనే దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను. గతంలో కూడా చావడానికి వెళ్లాను కానీ నీకు దొరికిపోయాను. ఈసారి మాత్రం చావడానికే వెళ్తున్నాను. సారీ బావా' అంటూ లెటర్ రాసి 11 నెలల కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో కుమారుడు చనిపోగా, తల్లిని స్థానికులు రక్షించారు.
ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం లక్కవరంలో చోటుచేసుకుంది. భర్త రణపంగు నవీన్ తెలిపిన వివరాల ప్రకారం, గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన మమతకు, హుజూర్‌నగర్ మండలం లక్కవరం గ్రామానికి చెందిన రణపంగు నవీన్‌తో 2018లో పెళ్లి జరిగింది. వీరికి సాన్వి(6) పాప, అయాన్ (11 నెలల) బాబు ఉన్నారు.
మానసిక ఇబ్బందులతో :మమతకు నాలుగు నెలల క్రితం వైరల్ జ్వరం తీవ్రంగా రావడంతో హైదరాబాద్‌లో చికిత్స చేయించారు. తర్వాత బాగానే ఉన్నప్పటికీ నెల రోజుల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం భర్త నవీన్‌కు ఫోన్ చేసి 'నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను, నా కోసం ఎవరూ వెతకకూడదు' అని చెప్పింది. ఆ సమయంలో నవీన్ ఆమె పుట్టింటి వారితో కలిసి ఆచూకీ తెలుసుకుని ఇంటికి తీసుకొచ్చి, పెద్ద మనుషులతో చర్చలు జరిగి తిరిగి కాపురానికి తీసుకుని వచ్చారు. అయితే ఆమెకు చికిత్స అనంతరం నుంచి మానసికంగా కొంత ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
ప్రేమన్నాడు - పెళ్లి మాట ఎత్తేసరికి కులం అడ్డొస్తుందన్నాడు : మనస్తాపంతో యువతి మృతి