Adilabad Rivers, Streams are Overflowing : వర్షాలు మొదలయ్యాయంటే చాలు ప్రకృతి ప్రేమికులకు సంతోషం హద్దులు దాటుతుంది. కారణం ఎండ కారణంగా ఎండిపోయిన చెట్లు, వాగులు, చెరువులు వర్షాల రాకతో కళను సంతరించుకుంటాయి. వాతావరణమంతా ఒక్కసారిగా చల్లగా, పచ్చగా మారుతుంది. అలాంటి వాతావరణాన్ని ఎవరు ఇష్టపడకుండా ఉండరు. కొందరైతే మంచి ప్లేసెస్‌ను చూసుకొని ట్రిప్స్ వెళ్తుంటారు. మరికొందరు కొండలు, వాగులు, జలపాతాల వద్దకు వెళ్లి ఫొటోస్ దిగుతుంటారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఉప్పొంగుతున్న వాగులు వంకలు వీడియో చూశారా (ETV Bharat) ఆనందంలో రైతులు, ప్రజలు :ప్రస్తుతం రాష్ట్రమంతటా గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు నిండుకుండలా మారుతున్నాయి. ఒకవైపు వర్షాలు కారణంగా రైతులు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుంటే మరోవైపు ప్రకృతి ప్రేమికులు ఆనందిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పలు వాగులు, చెరువులో వర్షం నీటితో ఉప్పొంగిపోతున్నాయి.
పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం- అందాలు చూడతరమా! - Bogatha Waterfalls Mulugu
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి దిగువ ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో సిర్పూర్ నియోజకవర్గంలోని అందవెల్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటి పెద్దవాగు పొంగి ప్రవహించింది. ఆవులు, గేదెలు, ఎద్దులు ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయగా కొంత దూరం వరకు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. తర్వాత సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయి. దీంతో వాటికి ఎలాంటి ప్రాణప్రాయం జరగలేదని యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.
చెరువులో ఆనందంగా చేపలు పడుతూ : వాంకిడి మండల కేంద్రానికి సుమారుగా 10కిలో మీటర్ల దూరంలో ఉన్న నవేదరి గ్రామంలోని చిక్లి వారుపై ఏర్పాటు చేసిన చెరువు మత్తడి గురువారం రాత్రి కురిసిన వర్షాకు నిండుకుండలా మారింది. మత్తడి పై నుంచి ఉధృతంగా నీరు దిగువకు పడుతున్నాయి. చెరువులో ఉన్న చేపలు దిగువకు ఒకేసారి ఎక్కువ మొత్తంలో పడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెరువు వద్దకు చెరుకుని ప్రమాదకరంగా చేపలను పట్టుకుంటున్నారు. గతంలో ఈ విధంగా చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు ప్రమాదాలు జరిగినప్పటికి మర్చిపోయి అదే తీరులో ప్రజలు చేపలు పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అధికారులు వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Kamareddy Rains : భారీ వర్షాలు.. పొంగుతున్న వాగులు.. నిజాంసాగర్లోకి పోటెత్తుతున్న వరద
Bore Flows without motor: ఆరేళ్లుగా ఆగని జలధార.. మోటారు లేకుండానే పొంగుతున్న గంగమ్మ