Attack With Petrol Case Update : మేడ్చల్ జిల్లా పరిధిలో ఇటీవల జరిగిన పెట్రోల్ దాడిలో గాయాల పాలై గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న ప్రకాశ్ అనే వ్యక్తి మరణించారు. ఇటీవల ప్రకాశ్ కుమారుడు ఓ యువతిని ప్రేమించాడు. తమ కుమార్తెను వేధిస్తున్నాడని ఆ యువతి బాబాయ్, తల్లి యువకుడిపై కోపంతో ఇంటికి వెళ్లారు. యువకుడి కోసం ఇంట్లో చూడగా తను లేకపోయే సరికి ఇంటిపై పెట్రోల్ చల్లి నిప్పు అంటించారు. నిందితులు పెట్రోల్ చల్లి ఇంటికి నిప్పు పెట్టడంతో అందులో ఉన్న యువకుడి తండ్రి ప్రకాశ్‌కు 50 శాతం, తల్లికి శరీరంపై అక్కడక్కడ గాయాలయ్యాయి.
అసలు ఏమైందంటే : మేడ్చల్ జిల్లా సికింద్రాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తమ కుమార్తెను ప్రేమిస్తున్నాడన్న కోపంతో ప్రదీప్ అనే వ్యక్తి ఇంటిపై యువతి బాబాయ్, తల్లి పెట్రోల్‌తో ఘోరమైన దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో యువకుడు ఇంట్లో లేకపోవడంతో అతని తల్లిదండ్రులు ప్రకాష్,హేమలతలపై పెట్రోల్ పోసి కర్కషంగా నిప్పంటించారు. ఇదే క్రమంలో అక్కడే ఉన్న నాలుగేళ్ల చిన్నారిపై కూడా పెట్రోల్ పడటంతో ఆ చిన్నారి కాలిపై స్వల్పంగా గాయాలు అయ్యాయి.
ఇంటిపై పెట్రోల్ చల్లి : పెట్రోల్ దాడిలో 50 శాతం గాయపడిన యువకుడి తండ్రిని వెంటనే సమీపంలో ఉన్న గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పాక్షికంగా కాలిన గాయాలతో తల్లి హేమలత బయటపడగా చిన్నారి సైతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందింది. దాడి చేయడానికి ముందు ప్రదీప్ ఇంటికి వచ్చిన యువతి బాబాయ్ నందకుమార్, తల్లి లక్ష్మీలతో మరికొందరు యువకులు వారి వెంట తెచ్చిన పెట్రోల్ బాటిల్‌ను ఇంట్లో వారిపై చల్లి నిప్పంటించారు. ఈ దాడితో ఇల్లు మంటలకు పాక్షికంగా దెబ్బతింది.
వేధిస్తున్నాడని కోపంతోనే : ఈ ఘటన జరిగిన సమయంలో యువకుడు ఇంట్లో లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఓ ఆసుపత్రిలో ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో ప్రదీప్ పని చేస్తున్నాడు. నందకుమార్, లక్ష్మిల కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే కోపంతో ముందుగా అతనిపైనే దాడి చేయాలని భావించి వారి కుటుంబ సభ్యులపై పెట్రోల్‌తో దాడి చేసి నిప్పంటించారు. ఈ ఘటనకు కారణంగా ప్రేమ వ్యవహారమే ప్రధానమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు లోతుగా దర్యాప్తును చేస్తున్నారు.
కుమార్తెతో కలిసి భర్తను హతమార్చిన భార్య - ఆ 'ప్రేమ' వద్దన్నందుకు ఘాతుకం!
దారుణం : కుమార్తెను ప్రేమిస్తున్నాడని ఓ యువకుడి తల్లిదండ్రులపై పెట్రోల్‌తో దాడి