తెలంగాణ

telangana

ETV Bharat / state

24 గంటల్లో భారీ వర్షాలు - ఆ జిల్లాల స్కూళ్లకు సెలవులు - AP WEATHER UPDATES

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం - 12 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం - సముద్రంలోనే బలహీనపడే అవకాశం - వాతావరణ శాఖ వెల్లడి

AP Rains
AP Rains (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 16 hours ago

AP Rains Alert :ఆంధ్రప్రదేశ్​కు వాయుగుండం ముంపు కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన ఆరు గంటలుగా వాయుగుండం 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 430 కి.మీ. దూరంలోనూ, చెన్నైకి ఈశాన్యంగా 480 కి.మీ., గోపాల్​పూర్​కు 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది తూర్పు, ఈశాన్యం దిశగా రాగల 12 గంటలపాటు కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత క్రమంగా సముద్రంలోనే బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.

ఈ వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల దృష్ట్యా విశాఖపట్టణంలోని అన్ని స్కూళ్లకు కలెక్టర్​ సెలవు ప్రకటించారు. పరిస్థితులను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు కలెక్టర్లు, అధికారులతో సమీక్షించి పరిశీలిస్తున్నారు. వారికి తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం :భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్​ అధికారులు ఆదేశించారు. వారితో మంత్రి గొట్టిపాటి రవికుమార్​ సమీక్ష నిర్వహించారు. వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. స్తంభాలు, చెట్లు నేలకొరిగితే వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్​ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలుగకూడని చెప్పారు.

సీఎం చంద్రబాబు సమీక్ష :ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీఎంవో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ జిల్లాల్లోని పరిస్థితులను సీఎంవో అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై వారు సీఎంకు వివరణ ఇచ్చారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు సీఎంవో అధికారులు చెప్పగా.. ఎలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా చూసుకోవాలని సీఎం వారికి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో సెలవులు ప్రకటించినట్లు చెప్పారు. పంట నష్టం వివరాలను సేకరించి రైతులకు సాయం అందించాలని అధికారులు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నాయన్న సమాచారాన్ని రైతులకు చెప్పాలని సీఎం అధికారులకు సూచించారు.

తుపాన్ అలర్ట్ : ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు! - ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్

బలహీనపడిన తీవ్ర వాయుగుండం - ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

ABOUT THE AUTHOR

...view details