TET Exam in Telangana :తెలంగాణ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ ద్వారా టీచర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. నేపథ్యంలో డీఎస్‌సీ కంటే ముందు రాయాల్సిన టెట్‌కు పరీక్షను ఎదుర్కోవాలి. టెట్‌లో అర్హత పొందాలంటే ఈ పరీక్షకు ఏకాగ్రతతో సమగ్రంగా సన్నద్ధం అవ్వటం మంచిది. అందుకు ఎలాంటి మెలకువలు, సాధన పాటించాలో తెలుసుకుందాం.
‣ అర్హత పరీక్షలో మెరుగైన స్కోరుకు కావాల్సిన మెలకువలు
‘భారతదేశ భవిష్యత్తు ఒక తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది’, ‘మిగతా అన్ని ఇతర వృత్తులనూ తయారు చేసేది కేవలం బోధన మాత్రమే.’ ఈ మాటలు ఉపాధ్యాయ వృత్తి గొప్పతనాన్ని అద్భుతంగా విపులీకరిస్తున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం సెక్షన్ 23(1) నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా పని చేయాలంటే కచ్చితంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో అర్హత పొంది ఉండాల్సిందే.
సన్నద్ధతకు ఇదీ మార్గం :
‣టెట్-1 రాసే అభ్యర్థులు అవసరమైన సబ్జెక్టుపై పట్టు సాధించాలంటే 3 నుంచి 8 తరగతుల వరకు చదవాలి.
‣పేపర్-2 రాసే అభ్యర్థులు 3 నుంచి 10వ తరగతి స్థాయి వరకు పక్కా ప్రణాళికతో చదవాలి.
‣టెట్ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తెలుగు అకాడమీ పుస్తకాలు చదివి నోట్సు తయారు చేసుకుని సాధన చేయాలి.
‣చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజిలో అభ్యసనం (లెర్నింగ్) యూనిట్‌లో ప్రధాన అంశాలైన ప్రేరణ, అభ్యసన అంగాలు, అభ్యసనా సిద్ధాంతాలు, అభ్యసన బదలాయింపు, స్మృతి-విస్మృతిపై ఎక్కువగా దృష్టి పెట్టి చదవాలి.
‣అధ్యాపన శాస్త్రం (పెడగాజి)లో కీలకంగా ఉండే బోధన ఉపగమాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, సహిత విద్య, బోధన దశలు, ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం (2009), జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం (2005)పై కాస్తా దృష్టి పెట్టి చదవాలి.
- భాషలు (లాంగ్వేజెస్)