పది నెలల బాలుడి కడుపులో బ్యాటరీ - అసలు ఏం జరిగిందంటే? - TEN MONTH BOY SWALLOWED A BATTERY
బ్యాటరీని మింగిన పది నెలల బాలుడు - ఎండోస్కోపీ చేసి బయటకు తీసిన తిరుపతి రిమ్స్ వైద్యులు

Published : Dec 18, 2024, 8:06 PM IST
Ten Month Old Boy Who Swallowed a Battery in Tirupati : పది నెలల బాలుడు మింగిన బ్యాటరీని తిరుపతిలోని స్విమ్స్ వైద్యులు తొలగించారు. బాలుడు ఆరోగ్యం మెరుగవడంతో మంగళవారం డిశ్చార్జి చేశారు. శ్రీకాళహస్తికి చెందిన బాలుడు ఇంట్లోని గుండ్రటి చిన్నపాటి బ్యాటరీ మింగాడు. అది చూసిన కుటుంబ సభ్యులు స్విమ్స్‌కు తీసుకువచ్చారు. సర్జికల్ గ్యాస్టో ఎంట్రాలజ విభాగం వైద్యులు ఎక్స్‌రేలో పరిశీలించి ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు. ఇలాంటివి జరిగినప్పుడు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకురావాలని, లేకపోతే ప్రాణాలకే హానీ అని డా.శివరామకృష్ణ, డా.వెంకట్రామిరెడ్డి అన్నారు.