తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎంను కలవనున్న తెలుగు సినీ ప్రముఖులు! - ఆ విషయాలపై చర్చించేందుకే!! - FILM CELEBRITIES TO MEET CM REVANTH

సీఎంను కలిసే యోచనలో తెలుగు సినీ ప్రముఖులు - టికెట్ల ధర, బెనిఫిట్ షోల చర్చించే అవకాశం

Telugu Film Celebrities Planning To Meet CM Revanth Reddy
Telugu Film Celebrities Planning To Meet CM Revanth Reddy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2024, 2:26 PM IST

Telugu Film Celebrities Planning To Meet CM Revanth Reddy : సంధ్య థియేటర్‌ ఘటన నేపథ్యంలో తెలుగు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే యోచనలో ఉన్నారు. ఈ మేరకు నిర్మాణ నాగవంశీ తెలిపారు. రామ్‌చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ మూపీ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఉన్న నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక రేవంత్‌ రెడ్డిని కలుస్తామని తెలిపారు. టికెట్‌ ధరల పెంపు, ప్రీమియర్‌ షోలు, బెనిఫిట్‌ షోలపై చర్చిస్తామని నాగవంశీ అన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘డాకూ మహారాజ్‌’. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం చిత్ర దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి కలిసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత ఈ సినిమా విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని అడగ్గా ఆ నిమిషంలో జరిగే దాన్ని ఎవరూ అపలేరని ఈసారి నుంచి కస్త జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. ఒక సినిమా ఎన్నో థియేటర్‌లలో రిలీజ్‌ అవుతుందని, ప్రతిచోటా మేం ఫాలోఅప్‌ చేయలం అన్నవారు ఒకవేళ అలా ఫాలోఅప్‌ చేస్తామని చెప్పినా అది నమ్మశక్యంగా ఉంటుందా అని తెలిపారు. వారి పరిధిలో ఉన్నంతవరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటామని, ఇటీవల జరిగిన ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు.

సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా: సీఎం రేవంత్‌రెడ్డి

అలాగే సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కు షిఫ్ట్‌ అవుతుందని టాక్‌ వినిపిస్తోంది కదా అని ప్రశ్నించగా తాను డబ్బు పెట్టి హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నా మరో ప్రాంతానికి ఎందుకు వెళ్తానన్నారు. ఇండస్ట్రీకి ఏపీ గవర్నమెంట్‌ నుంచి ఎప్పుడూ సపోర్ట్‌ ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి చెబుతూనే ఉన్నారు. అలానే అప్పటి నుంచి రిలీజ్‌ అయిన సినిమాలకు కూడా ఆయన సపోర్టు చేస్తునే ఉన్నారని తెలిపారు.

సంధ్య థియేటర్‌ ఘటన దాని తదనంతర పరిణామాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో కొత్త సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచేది లేదని, బెనిఫిట్‌ షోలకూ అనుమతి ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో చిత్ర పరిశ్రమ వర్గాలు ఒక్కసారిగా షాకయ్యాయి. మరో 20 రోజుల్లో సంక్రాంతి సందర్భంగా వరుస సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భారీ బడ్జెట్‌, అగ్ర కథానాయకుల సినిమాలు ఉండటంతో వాటి వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.

'22 ఏళ్లు కష్టపడి సాధించుకున్న నమ్మకం, గౌరవం ఒక్క రాత్రిలో పోగొట్టారు' - బన్నీ కన్నీంటి పర్యంతం

ABOUT THE AUTHOR

...view details