Telangana Weather Report Today : నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్ వరకు ఉన్నాయని విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాగల మూడు రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నాయని వెల్లడించింది. ఇవాళ క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ, నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని ప్రకటించింది.
రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏ ఏ జిల్లాలో పడే అవకాశం ఉందో తెలిపింది. వాటి వివరాలు :
క్రమ సంఖ్య | తేదీ | జిల్లాల పేర్లు | గాలి వేగం |
1 | 10/06/2024 | నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ | 30 - 40 కిలోమీటర్లు |
2 | 11/06/2024 | నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ | 30 - 40 కిలోమీటర్లు |
3 | 12/06/2024 | ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట | 30 - 40 కిలోమీటర్లు |