తెలంగాణ

telangana

ETV Bharat / state

టెట్​ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - ఈనెల 20 వరకు దరఖాస్తుల గడువు పెంపు - ts tet 2024 updates

Telangana TET Exam Deadline Extended 2024 : తెలంగాణలో టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నేటితో దరఖాస్తుల గడువు ముగియనుండగా తాజాగా ఆ గడువును ఈ నెల 20 వరకూ పెంచుతున్నట్లు సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు మంగళవారం నాటికి 1.93 లక్షల మంది అర్జీ చేసుకున్నారు.

TS TET 2024
TS TET 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 11:42 AM IST

Updated : Apr 10, 2024, 12:25 PM IST

Telangana TET Exam Deadline Extended 2024 :రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) రాసే అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మంగళవారం నాటికి 1.93 లక్షల మంది అర్జీ చేసుకున్నారు. ఇవాళ ఒక్క రోజే గడువు ఉండగా తాజాగా ప్రభుత్వం ఆ గడువును పొడిగించింది. గత సంవత్సరం సెప్టెంబరులో నిర్వహించిన ఈ పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేశారు. వచ్చే నెల 20 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Telangana TET Applications Date :ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 2.50 లక్షల మంది టెట్‌లో అర్హత పొందారు. ఉపాధ్యాయ కొలువు ఎంపికలకు నిర్వహించే డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో కొత్తగా డీఈడీ, బీఈడీ పాసైన అభ్యర్థులతోపాటు గతంలో టెట్‌ పాసైన వారు సైతం మార్కులు పెంచుకునేందుకు ఈ పరీక్ష నిర్వహించిన ప్రతిసారీ రాస్తుంటారు.

టెట్‌ రాస్తున్నారా.. ఈ ట్రిక్స్ ఫాలో అయితే జాబ్ పక్కా మీదే..

డీఎస్సీపైనే అభ్యర్థుల దృష్టి!

  • గత సంవత్సరం వరకు టెట్‌లో రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే దరఖాస్తు రుసుం (Increasing Tet Exams Fees)ఉండేది. ఈసారి ఒక్కో పేపర్‌కు అర్జీ రుసుమును రూ.1000కి పెంచారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళన నిర్వహించినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
  • వాస్తవానికి ఈసారి డీఎస్సీలో ఉద్యోగాల సంఖ్య 11,062కి పెరగడంతో టెట్‌ రాసేవారి సంఖ్య కూడా అధికంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనికితోడు ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్‌ తప్పనిసరి అని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వారు సైతం అర్జీ చేస్తారని ఆశిస్తున్నారు.
  • అయితే తమకు ప్రత్యేక టెట్‌ జరపాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేయడంతో పాటు మరికొన్ని సందేహాలు లేవనెత్తారు. వీటిపై జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) నుంచి ఇంకా స్పష్టత రాలేదు.
Last Updated : Apr 10, 2024, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details