Telangana RTC Transports 5 Lakh People : సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగర వాసులు సొంతూళ్లకు భారీగా తరలి వెళ్తున్నారు. గత రెండు మూడు రోజులుగా భారీగా రద్దీ కొనసాగుతోంది. ఓ వైపు రైళ్లు ఫుల్లుగా కిక్కిరిసిపోవడం, ప్రైవేటు వాహనాలలో ఇష్టారితీన ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు జేబుకు చిల్లు పడకుండా తెలంగాణ ఆర్టీసీ బాటపడుతున్నారు.
5 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చిన తెలంగాణ ఆర్టీసీ - TELANGANA RTC TRANSPORTS
సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు భారీగా వెళ్తున్న నగరవాసులు - ఇప్పటికే 5వేలకు పైగా బస్సులను నడిపిన టీజీఎస్ఆర్టీసీ - మెుత్తం 6,432 బస్సులను నడిపిస్తున్న యాజమాన్యం
TGSRTC RECORD (ETV Bharat)
Published : Jan 12, 2025, 10:18 PM IST
దీంతో ఆర్టీసీకి ఖజానాలో కాసుల వర్షం కురుస్తోంది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే ఐదు లక్షల మంది ప్రజలు ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 6,432 బస్సులను నడపాలని ముందుగా నిర్ణయించిన టీజీఎస్‌ఆర్టీసీ, ఇప్పటి వరకు 5 వేలకు పైగా బస్సులను రొడ్డెక్కించింది. మరి కొన్ని గంటలపాటు ఈ రద్దీ కొనసాగే అవకాశమున్న నేపథ్యంలో స్పెషల్ బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు సంబంధిత యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు.