తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో సిరుల పంట - వరి ధాన్యం దిగుబడిలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ - Rice Crop Yield in Telangana - RICE CROP YIELD IN TELANGANA

Telangana Top Place in Rice crop Yield : తెలంగాణలో సిరుల పంట పండుతోంది. 2023-24 సంవత్సరంలో 168.74 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, పెరిగిన నీటిపారుదల సౌకర్యాలతో రాష్ట్రం ధాన్యలక్ష్మికి నిలయంగా మారింది.

Telangana Top Place in Rice crops Yield
Telangana Ranked First Place in Rice crops yielding (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2024, 3:54 PM IST

Updated : Sep 26, 2024, 4:09 PM IST

Telangana Ranked First Place in Rice crop yielding : దేశవ్యాప్తంగా వరి పంట దిగుబడిలో తెలంగాణ సత్తా చాటింది. 2023-24లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అలాగే పత్తి దిగుబడిలో 3, పొద్దుతిరుగుడులో 4, మొక్కజొన్న, చిరుధాన్యాల్లో 5వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పొగాకు దిగుబడిలో 2, మినుము, ఆముదంలో 3, జొన్న, వేరుసెనగ పంటలో 5 స్థానంలో నిలిచింది. దేశంలో ప్రధాన పంటల దిగుబడుల తుది అంచనాల నివేదికను కేంద్రవ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసింది.

కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కేంద్రప్రభుత్వం ఈ అంచనాలను రూపొందించింది. పంటలపై రిమోట్‌ సెన్సింగ్, ప్రతి వారం రూపొందించే క్రాప్‌ వెదర్‌వాచ్‌ గ్రూప్, ఇతర ఏజెన్సీల నుంచి వచ్చిన డేటాను సరిపోల్చుకొని తుది నివేదికను విడుదల చేసింది. దేశంలో ప్రధాన పంటల దిగుబడులు రికార్డుస్థాయిలో బాగా పెరిగినట్లు పేర్కొంది. వాటి వివరాలిలా ఉన్నాయి.

26.11 లక్షల టన్నులు అధికం :దేశవ్యాప్తంగా 2023-24 సంవత్సరంలో ప్రధాన పంటలు 3,322.98 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. 2022-23 సంవత్సరం నాటి తుది అంచనాలతో పోలిస్తే ఇది 26.11 లక్షల టన్నులు అధికం. పంటల వారీగా గోధుమ 27.38 లక్షలు, వరి 20.70 లక్షలు, చిరుధాన్యాలు 2.51 లక్షల టన్నుల మేర దిగుబడులు పెరిగాయి. 2023-24లో మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల్లో కరవులాంటి పరిస్థితులు, రాజస్థాన్‌లో సుదీర్ఘ వర్షాభావ పరిస్థితులు ఉండటం వల్ల సోయాబీన్, పప్పు దినుసులు, పత్తి వంటి పంటలపై ప్రభావం చూపినట్లు కేంద్రం తెలిపింది.

2023-24లో వరి దిగుబడిలో 168.74 లక్షల టన్నులు సాధించి తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం సాధించిన వరి దిగుబడుల్లో ఇదే అత్యధికం. తర్వాతి స్థానాల్లో వరుసగా ఉత్తర్‌ప్రదేశ్‌ (159.90 లక్షల టన్నులు), పశ్చిమబెంగాల్‌ (156.87), పంజాబ్‌ (143.56), ఛత్తీస్‌గఢ్‌ (97.03) రాష్ట్రాలు నిలిచాయి. ఇక ఏపీలో వరి దిగుబడి 73.42 లక్షల టన్నులుగా తుది అంచనాలు వచ్చాయి. గడిచిన ఐదేళ్లలో ఇదే అతి తక్కువ నమోదు కావడం గమనార్హం

తెలంగాణలో పండిన మిగతా పంటలలో చిరుధాన్యాలు 199.15 లక్షలు, మొక్కజొన్న 27.79 లక్షలు, పొద్దుతిరుగుడు 0.15 లక్షల టన్నుల దిగుబడులు సాధించింది. అలాగే 50.80 లక్షల బేళ్ల పత్తిని ఉత్పత్తి చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జొన్న 3.29 లక్షలు, ఆముదం 0.25 లక్షలు, మినుము 3.45 లక్షలు, వేరుసెనగ 3.23 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. పొగాకు 2 లక్షల టన్నులుగా దిగుబడి వచ్చింది. కంది పంట దిగుబడులకు సంబంధించి దేశవ్యాప్తంగా 34.17 లక్షల టన్నులు ఉత్పత్తి సాధించగా తెలంగాణలో 1.45 లక్షలు, ఏపీలో 0.96 లక్షల టన్నులుగా లభించింది. అలాగే దేశంలో శనగపంట దిగుబడి 110.39 లక్షల టన్నులు కాగా, ఆంధ్రప్రదేశ్​లో 3 లక్షలు, తెలంగాణలో 1.64 లక్షల టన్నుల దిగుబడి లభించింది.

మొక్క మొలిచింది మొదలు - పూతపూసి కాయ కాసే కడవరకు - పంటంతా ఎరువులమయం! - Chemical Fertilizers in Crops

'దండిగా వానలు పడ్డా సాగు మాత్రం తగ్గింది' - ఎందుకిలా? - ఏం జరిగింది? - Crops Cultivation In Mahbubnagar

Last Updated : Sep 26, 2024, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details