Telangana Power Department focused on 24 Hours supply : విద్యుత్ వ్యవస్థ ఆవిర్భావం నుంచి కూడా మెయింటెనెన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. విద్యుత్ వ్యవస్థలో సబ్ స్టేషన్స్ నిర్వహణ, లైన్స్, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ అనేది నిరంతర సాధారణ ప్రక్రియ. సంవత్సరంలో రెండు సార్లు విద్యుత్ వ్యవస్థలో మెయింటెనెన్స్ నిర్వహిస్తారు. వేసవి కాలంలో ఒకసారి, వర్షాకాలం ముందు ఒకసారి విద్యుత్ నిర్వహణ చేపడుతుంటారు.
Power Interruption Works in Telangana : నిర్వహణ, భద్రతా చర్యలో భాగంగా విద్యుత్ తీగలకు అడ్డుగా నున్న చెట్ల కొమ్మల తొలగింపు, ప్లెక్సీలు, బ్యానర్లను అధికార సిబ్బంది తొలగిస్తున్నారు. స్విచ్‌లు, ఇన్సులేటర్, కాంటాక్ట్స్ చెక్ చేయడం వదులుగా ఉన్న తీగలు సరి చేయడం, తీగలపై పడ్డ దారాలు, ఇతర వస్తువులు తొలగించడం వంటి పనులను అధికారులు నిరంతం చేపడుతుంటారు. ట్రాన్స్ ఫార్మర్ల ఎర్తింగ్, సర్క్యూట్ బ్రేకర్‌లు, రిలేల పనితీరు తనిఖీ వంటి పనులు చేపడుతుంటారు.
TGSPDCL Action on Power Interruption: భాగ్యనగరంలో ఏ చెట్టు ఎప్పుడు కూలుతుందో తెలియడం లేదు. చిన్న గాలివచ్చినా తేలికపాటి వర్షం కురిసినా కనీసం పదిచెట్లు నేలకొరుగుతున్నాయి. ఆదివారం వచ్చిన ఈదురుగాలులకు భారీగా చెట్లు కూలిపోయాయి. రెండు వారాలుగా నగరంలో అడపాదడపా కురిసిన వర్షాలతో భారీగానే చెట్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎప్పటికప్పుడు మెయింటనెన్స్ చేయడం అనేది విద్యుత్ వ్యవస్థలో కీలకమైన అంశంగా మారిపోయింది.