Telangana MP's Took Oath At Lok Sabha :కొత్త లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రమాణాలు ప్రతిధ్వనించాయి. కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, సురేశ్ షెట్కార్ తెలుగులో ప్రమాణం చేయగా, వంశీకృష్ణ, రామసహాయం రఘురాంరెడ్డి ఇంగ్లీష్‌లో ప్రతిజ్ఞ చేశారు.
Telangana MPs Oath Taking : బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ తెలుగులో ప్రమాణం చేయగా, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంగ్లీష్‌లో, గోడం నగేశ్ హిందీలో ప్రమాణం చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన జై పాలస్తీనా నినాదం ఇవ్వడంతో పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిబంధనలు పరిశీలించి అసదుద్దీన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రొటెం స్పీకర్ రాధామోహన్ సింగ్ స్పష్టం చేశారు.
18వ లోక్‌సభలో తెలంగాణ నుంచి ఎంపీలుగా ప్రమాణం చేసిన 17 మంది వీరే
ఎంపీ పేరు | పార్టీ | నియోజకవర్గం |
కిషన్ రెడ్డి | బీజేపీ | సికింద్రాబాద్ |
బండి సంజయ్ | బీజేపీ | కరీంనగర్ |
ఈటల రాజేందర్ | బీజేపీ | మల్కాజిగిరి |
డీకే అరుణ | బీజేపీ | మహబూబ్‌నగర్ |
రఘునందన్ రావు | బీజేపీ | మెదక్ |
ధర్మపురి అర్వింద్ | బీజేపీ | నిజామాబాద్ |
కొండా విశ్వేశ్వర్ రెడ్డి | బీజేపీ | చేవేళ్ల |
గోడం నగేశ్ | బీజేపీ | ఆదిలాబాద్ |
మల్లు రవి | కాంగ్రెస్ | నాగర్ కర్నూల్ |
చామల కిరణ్ కుమార్ రెడ్డి | కాంగ్రెస్ | భువనగిరి |
రఘువీర్ రెడ్డి | కాంగ్రెస్ | నల్గొండ |
రామసహాయం రఘురాం రెడ్డి | కాంగ్రెస్ | ఖమ్మం |
కడియం కావ్య | కాంగ్రెస్ | వరంగల్ |
సురేశ్ షెట్కార్ | కాంగ్రెస్ | జహీరాబాద్ |
వంశీ కృష్ణ | కాంగ్రెస్ | పెద్దపల్లి |
బలరాం నాయక్ | కాంగ్రెస్ | మహబూబాబాద్ |
అసదుద్దీన్ ఓవైసీ | ఎంఐఎం | హైదరాబాద్ |