07.28 PM
మెజార్టీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారు: కిషన్‌రెడ్డి
మెజార్టీ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కొంత పోలింగ్ శాతం తగ్గిందన్నారు. పార్టీ ఏదైనా సరే ప్రధానిగా మోదీ ఉండాలని ప్రజలు భావించారని అన్నారు. ఎక్కువ మంది ఏపీ ప్రజలు ఓట్ల కోసం అక్కడికి వెళ్లిపోయారని తెలిపారు. 'ఏపీ ప్రజలు స్వగ్రామాలకు వెళ్లడంతో హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తగ్గింది. మోదీకే ఓటు వేస్తున్నామని పోలింగ్ కేంద్రాల వద్ద బహిరంగంగా చెప్పారు. పట్టణప్రాంత వాసులే కాదు ఈసారి పల్లెల్లోనూ బీజేపీకి ఓట్లు బాగా వేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నమ్మలేదు. పోలింగ్ శాతం తగ్గినా బీజేపీకి సానుకూలంగా ఓట్లు పడ్డాయి. మేం ఆశించినట్లుగానే రాష్ట్రంలో బీజేపీకి రెండంకెల ఎంపీ సీట్లు వస్తాయి' అని అన్నారు.
07.22 PM
ఏపీలో పోలింగ్ కేంద్రం వద్ద నాటు బాంబులతో దాడులు
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో దాచేపల్లి మండలం తంగెడలో బాంబు దాడులు జరిగాయి. ఓటు విషయంలో పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సాఆర్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో తంగెడ వద్ద జరిగిన ఘర్షణలో రెవెన్యూ సిబ్బంది బైకు దగ్ధమయింది.
07.17 PM
పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంల తరలింపు ప్రక్రియ ప్రారంభం
ఈవీఎంలను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంల తరలింపు ప్రక్రియ ప్రారంభమయింది.
07.10 PM
రాష్ట్రంలో 44 స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేశాం: సీఈవో వికాస్‌రాజ్
రాష్ట్రంలో 44 స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేశామని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు.ఈవీఎంల తరలింపు కొన్నిచోట్ల అర్ధరాత్రి ఒంటిగంట వరకు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. సజావుగా సాగేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
07.05 PM
ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది: సీఈవో వికాస్‌రాజ్
రాష్ట్రంలో పోలింగ్ శాతం బాగానే ఉందని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరిగిందని చెప్పారు. తుది ఓటింగ్ శాతంపై కాసేపట్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ఇవాళ వివిధ కారణాలపై 38 కేసులు నమోదు చేశామని తెలిపారు. జీపీఎస్ ఉన్న వాహనాల్లో ఈవీఎంలు తరలిస్తామని స్పష్టం చేశారు.
06.41 PM
పుట్టెడు బాధలోనూ ఓటు హక్కు వినియోగించుకున్న భార్యాభర్తలు
జగిత్యాల జిల్లాలో ఇంట్లో తల్లి చనిపోయిన బాధలోనూ ఓ కుమారుడు, అతని భార్య ఓటు వేసి తన ఓటు హక్కు వినిగియోంచుకుని పలువురి మన్ననలను పొందారు. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో తోకల గంగాధర్ తల్లి మల్లు అనే వృద్దురాలు మృతి చెందింది. అయితే అంత్యక్రియలు ఇవాళ చేయాల్సి ఉండగా కార్యక్రమం పూర్తి చేసిన గంగాధర్, అతని భార్య ఇద్దరు వచ్చి ఓటు వేశారు. ఓటు బాధ్యత గుర్తించి ఓటు వేసినట్లు గంగాధర్ పేర్కొన్నారు. పుట్టెడు దుఖఃంలోనూ ఓటు వేయటంపై అధికారులు ఆయనను అభినందించారు.
06.31 PM
చౌటుప్పల్ పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ
రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఓటర్లు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. దీంతో చౌటుప్పల్ పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. ఏపీ నుంచి తిరిగివస్తున్న ఓటర్లతో వాహనాలు పెరిగాయి. ఏపీతోపాటు కోదాడ, ఖమ్మం నుంచి అధిక సంఖ్యలో ఓటర్లు తిరిగివస్తున్నారు.
06.05 PM
రాష్ట్రంలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. సాయంత్రం 6 లోపు పోలింగ్ బూత్‌లో ఉన్నవారు ఓటు వేసే అవకాశం ఉంటుంది. పలుచోట్ల సాయంత్రం వేళ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నారు. పలుచోట్ల పోలింగ్ కేంద్రంలో క్యూలో అధిక సంఖ్యలో ఓటర్లు నిలుచున్నారు. క్యూలో నిలబడిన వారు పూర్తయ్యే వరకు కొనసాగనున్న పోలింగ్ జరుగుతోంది.
05.40 PM
సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలో ఓటింగ్ శాతం 61.16
సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలో ఓటింగ్ శాతం 61.16 నమోదు అయింది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది
05.24 PM
పోలింగ్ బూత్‌లను పరిశీలించిన మల్కాజిగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్
కూకట్‌పల్లిలోని పలు ప్రాంతాలలో పోలింగ్ బూత్‌లను మల్కాజిగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ పరిశీలించారు. హైదరాబాదులో ఆశించిన రీతిలో పోలింగ్ జరగలేదని అన్నారు.
05.19 PM
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మార్గంలో మధ్యలో బీజేపీ, ఎంఐఎం ఎంపీ అభ్యర్థులు ఎదురుపడ్డారు. ఓ గల్లీలో అసదుద్దీన్, మాధవీలత వాహనాలు ఎదురుగా వచ్చాయి. అనంతరం మాధవిలత వాహనాన్ని యువకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు స్పందించి అసదుద్దీన్, మాధవీలత కార్లను అక్కడినుంచి పంపించారు.
05.11 PM
ఓటర్లకు డబ్బు పంచుతూ పట్టుబడిన డిప్యూటీ మేయర్ భర్త
వరంగల్ జిల్లాలోని ఓటర్లకు డబ్బు పంచుతూ డిప్యూటీ మేయర్ భర్త పట్టుబడ్డారు. బీఆర్ఎస్ నేత మసూద్ నుంచి రూ.47 వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
05.09 PM
పిప్రియాల్ తండాలో 3 గంటలకు ప్రారంభమైన పోలింగ్
కామారెడ్డి జిల్లాలోని పిప్రియాల్ తండాలో 3 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి పోలింగ్‌ను పిప్రియాల్ తండా వాసులు బహిష్కరించారు. తండాలో సమస్యలు పరిష్కరించలేదని ఓటింగ్ ప్రక్రియను గిరిజనులు బహిష్కరించారు. అధికారులు నచ్చజెప్పడంతో 3 గంటలకు ప్రారంభమైంది.
04.59 PM
జగిత్యాల జిల్లాలో ఓటు వేస్తూ ఫొటో తీసుకున్న ఓటరుపై కేసు నమోదు
జగిత్యాల జిల్లాలో ఓటు వేస్తూ ఫొటో తీసుకున్న ఓటరుపై అధికారులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం మండలం వేముల కుర్తిలో ఓటు వేస్తూ జయరాజ్ అనే ఓటరు సెల్ఫీ దిగాడు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
04.47 PM
కామారెడ్డిలో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎస్‌ఐ దాడి
కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం ముత్యంపేటలో ఆందోళన కొనసాగుతోంది. రోడ్డుపై నిలబడిన బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎస్‌ఐ గణేశ్ దాడి చేశారు. ఎస్‌ఐ తీరును నిరసిస్తూ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన చేస్తున్నారు. ఎస్‌ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతల డిమాండ్ చేస్తున్నారు.
04.30 PM
ఓటు హక్కు వినియోగించుకున్న మహేశ్‌బాబు, రామ్ చరణ్
జూబ్లీహిల్స్ పబ్లిక్‌స్కూల్‌లో ఓటు మహేశ్‌బాబు దంపతులు వేశారు. జూబ్లీ హిల్స్ క్లబ్లో రామ్ చరణ్, ఉపాసన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
04.10 PM
మావోయిస్టు ప్రభావిత 13 అసెంబ్లీ సెగ్మెంట్ల వివరాలు
రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేట పరిధిలో పోలింగ్ ముగిసింది. క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
04.00 PM
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. 5 ఎంపీ నియోజకవర్గాల్లోని 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరిగింది. 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతోంది.
03.30 PM
రాష్ట్రంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.32 శాతం పోలింగ్ నమోదు
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది.మధ్యాహ్నం 3 గంటల వరకు 52.32 శాతం పోలింగ్ నమోదు అయింది.
03.22 PM
ఖమ్మం ఎంపీ నియోజకవర్గం పరిధిలో 3 గంటల వరకు 63.67 శాతం పోలింగ్ నమోదు
ఖమ్మం ఎంపీ నియోజకవర్గం పరిధిలో 3 గంటల వరకు 63.67 శాతం పోలింగ్ నమోదు అయింది. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో 3 గంటల వరకు 58.24 శాతం పోలింగ్ నమోదు అయింది. వరంగల్ ఎంపీ నియోజకవర్గంలో 3 గంటలక వరకు 61.4 శాతం పోలింగ్ నమోదు అయింది. మహబూబాబాద్ ఎంపీ స్థానంలో 61.4 శాతం, పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గంలో 55.92 శాతం, నల్గొండ ఎంపీ నియోజకవర్గంలో 59.91 శాతం పోలింగ్ 3 గం. వరకు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్ ఎంపీ నియోజకవర్గంలో 62.44 శాతం, మెదక్ ఎంపీ నియోజకవర్గంలో 60.94 శాతం, నాగర్‌కర్నూల్ ఎంపీ నియోజకవర్గంలో 57.17 శాతం, మహబూబ్‌నగర్ ఎంపీ నియోజకవర్గంలో 58.92 శాతం మధ్యాహ్నం 3 గం. వరకు నమోదయ్యాయి.
03.19 PM
ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మరంగా కొనసాగుతున్న పోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మరంగా పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం 2 గంటల వరకు 50 శాతం పోలింగ్ నమోదు అయింది.
03.02 PM
ఉప్పల్‌లో పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో మహిళ మృతి
ఉప్పల్‌లో పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో మహిళ మృతి చెందింది. పోలింగ్ కేంద్రంలో భరత్‌నగర్‌కు చెందిన విజయలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో సహాయక సిబ్బంది ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయారని వైద్యులు తెలిపారు.
03.00 PM
బంజారాహిల్స్ నందినగర్‌లో ఓటు వేసిన ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్
బంజారాహిల్స్ నందినగర్‌లో ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఓటు వేశారు.
02.58 PM
ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
మంచిర్యాల జిల్లా గద్దె రేగడి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దంపతులు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన సుమన్ వరుసలో నిలబడి ఓటు వేశారు. అనంతరం చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు.
02.56 PM
జూబ్లీహిల్స్ పబ్లిక్‌స్కూల్‌లో ఓటు వేసిన బ్రహ్మానందం
జూబ్లీహిల్స్ పబ్లిక్‌స్కూల్‌లో బ్రహ్మానందం, ఆయన కుమారుడు ఓటు వేశారు.
02.36 PM
ఎఫ్‌ఎన్‌సీసీలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీనటుడు విశ్వక్ సేన్
ఎఫ్‌ఎన్‌సీసీలో సినీనటుడు విశ్వక్ సేన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబాబాద్‌లో కురవి మండలంలోని పెద్దతండాలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఓటేశారు. వనపర్తిలోని అమరచింత జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 2 గంటలుగా ఈవీఎం పనిచేయ లేదు. పోలింగ్ బూత్ నంబర్ 228/77లో ఈవీఎంలు మోరాయించాయి.
02.06 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆదేశించారు. అనంతరం ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మలక్‌పేట పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. పోలింగ్ కేంద్రంలో ముస్లిం మహిళా నకాబ్ తొలగించి మాధవీలత పరిశీలించారు.
1.58 PM
కంటోన్మెంట్లో మధ్యాహ్నం 1 వరకు 29.03 శాతం పోలింగ్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో పోలింగ్ కొనసాగుతోంది. కంటోన్మెంట్లో మధ్యాహ్నం 1 వరకు 29.03 శాతం వరకు పోలింగ్ నమోదు అయింది.
1.22 PM
మధ్యాహ్నం 1 గంటకు 40.38 శాతం పోలింగ్ నమోదు
మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం పోలింగ్ నమోదు అయింది.
01.12 PM
గచ్చిబౌలిలో ఓటేసిన సినీనటుడు నాని
గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాలలో సినీనటుడు నాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎఫ్‌ఎన్‌సీసీలో సినీనటుడు విశ్వక్ సేన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
12.52 PM
జనగామ బాలికల ఉన్నతపాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
జనగామ బాలికల ఉన్నతపాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ సరళి చూసేందుకు యువజన కాంగ్రెస్ నేత ప్రశాంత్‌రెడ్డి లోపలికి వెళ్లారు. దీనిపై బీఆర్ఎస్ ఏజెంట్ ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
12.48 PM
ఓటు హక్కు వినియోగించుకున్న శ్రీధర్‌బాబు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి శ్రీధర్‌బాబు ఓటు వేశారు.
12.32 PM
వందశాతం
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్నకొలువాయిలో వందశాతం పోలింగ్ నమోదైంది.
12.25 PM
ఓటేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ