Serial Actress Harrased in Hyderabad : ప్రేమ, పెళ్లి పేరుతో ఓ టీవీ సీరియల్ నటిని వేధింపులకు గురిచేసిన యువకుడిని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ(29) సీరియల్స్‌లో నటిస్తూ యూసుఫ్‌గూడ ప్రాంతంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. 2024 సెప్టెంబరు నెలలో ఓ సీరియల్‌లో నటిస్తున్న సమయంలో బత్తుల ఫణితేజ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారింది.
నిరాకరించడంతోనే దుష్ప్రచారం : ఈ క్రమంలోనే నవంబరు నెలలో ఆమెను వివాహం చేసుకోవడానికి ఫణితేజ ముందుకు వచ్చాడు. ఆ మహిళకు అంతకు ముందే పెళ్లై తన భర్తకు దూరంగా ఉంటోంది. అలాగే తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న విషయాన్ని చెప్పి పెళ్లికి నిరాకరించింది. దీంతో అప్పటి నుంచి ఆమెకు ఫణితేజ వాట్సాప్ నుంచి అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపుతున్నాడు. ఆమె అత్తగారింటి ఇంటి అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆమె గురించి చెడుగా ప్రచారం చేశాడు.
ఫిర్యాదుతో కాళ్ల బేరానికి : బాధితురాలు జూబ్లీహిల్స్‌లో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడు భయపడి కాళ్ల బేరానికి వచ్చాడు. తన ప్రవర్తన కారణంగానే ఇదంతా జరిగిందని క్షమాపణ కోరుతూ ఆమెకు సెల్ఫీ వీడియోను పంపించాడు. బాధితురాలి వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా దుష్ప్రచారం చేసినందుకు పోలీసులు ఫణి తేజను అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కి తరలించినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
యువతికి వేధింపులు - యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్
ఆ యువకుడి వేధింపుల వల్లే నా చిట్టితల్లి ఆత్మహత్య చేసుకుంది - భువనగిరిలో యువతి మృతిపై తండ్రి ఫిర్యాదు