తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 25 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Wed Sep 25 2024 లేటెస్ట్‌ వార్తలు- హైడ్రా మరింత బలోపేతం​ - 169 మంది సిబ్బంది కేటాయింపు - TG Govt Allotted Staff to Hydra

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Telangana Live News Desk

Published : Sep 25, 2024, 7:10 AM IST

Updated : Sep 25, 2024, 9:45 PM IST

09:42 PM, 25 Sep 2024 (IST)

హైడ్రా మరింత బలోపేతం​ - 169 మంది సిబ్బంది కేటాయింపు - TG Govt Allotted Staff to Hydra

Telangana Govt Allotted Staff To Hydra : హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు హైడ్రాకు 169 మంది సిబ్బందిని కేటాయించింది. ఇందులో నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు ఉన్నారు. 16 మంది ఎస్సైలు, 60 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్‌ ఆఫీసర్లు, పదిమంది అసిస్టెంట్ ఇంజినీర్లను హైడ్రాకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. | Read More

ETV Bharat Live Updates - HYDRA STAFF IN TELANGANA

08:54 PM, 25 Sep 2024 (IST)

మూసీ నిర్వాసితులకు అండగా నిలిచేలా ప్రభుత్వం సన్నాహాలు - మూడు జిల్లాల పరిధిలో రీ సర్వే - Officials Conduct Resurvey At Musi

Officials Conduct Survey To Find Musi Expats : హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీ గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అధికారులు రంగంలోకి దిగారు. అర్హులైన నిర్వాసితులకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి క్షేత్ర స్థాయిలో రీ సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలు, నివాసాల యజమానుల నుంచి ఇంటి పత్రాలు, ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరిస్తున్నారు. ఆ వివరాల ఆధారంగా మూసీ నది నిర్వాసితులకు జీహెచ్ఎంసీ పరిధిలో రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించనున్నారు. అంతేకాకుండా నివాసాలు కోల్పేయే పేదలకు పరిహారం చెల్లించాకే భూసేకరణ చేస్తామని, ఆ తర్వాతే నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. | Read More

ETV Bharat Live Updates - GOVT FOCUS ON MUSI REJUVENATION

06:46 PM, 25 Sep 2024 (IST)

సీఎం రేవంత్, ఆయన అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు : కేటీఆర్ - KTR Fires On CM Revanth Reddy

KTR Meeting With Hanamkonda Leaders : ఈ దఫాలో ముఖ్యమంత్రి అవుతానని రేవంత్​రెడ్డి కూడా అనుకోలేదని, ఈ విషయం గురించి ఆయన దోస్తులే తనకు చెప్పారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే 2028లో సీఎం అవుదామనుకొని, ఈ దఫా ఎన్నికల్లో నోటికొచ్చినట్లు అడ్డగోలు అబద్దాలు చెప్పారని అన్నారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తానని మోసం చేశారని ధ్వజమెత్తారు. | Read More

ETV Bharat Live Updates - KTR MEETING WITH HANAMKONDA LEADERS

05:34 PM, 25 Sep 2024 (IST)

YUVA : ఈ యువకుల వృత్తి సాఫ్ట్‌వేర్‌ ప్రవృత్తి ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ - సేంద్రీయ సాగులో రాణిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు - Special Story On SOFTWARE FARMERS

Software Engineer Turned Into A Farmer : ప్రస్తుత రోజుల్లో తినే తిండి దగ్గర నుంచి తాగే నీరు, పీల్చే గాలి వరకు ప్రతిదీ కలుషితం అవుతోంది. కాలుష్యపు వాతావరణం, రసాయనాలతో పండించిన కూరగాయలు ఆ యువతకి రుచించలేదు. స్వచ్ఛమైన ఆహారంతోనే ఆరోగ్యాలను కాపాడుకోగలమని బలంగా నమ్మారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తూనే సేంద్రీయ సాగువైపు సాగారు. త్వరలో రైతన్నలకు లాభాలు అందించేలా యాప్‌ రూపొందిస్తామంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ నుంచి సాగుబడిలోకి వచ్చిన యువతపై ప్రత్యేక కథనం. | Read More

ETV Bharat Live Updates - STORY ON SOFTWARE FARMERS

05:17 PM, 25 Sep 2024 (IST)

పెళ్లి చేసుకోమ్మంటే అత్యాచారం చేసి ఊరేసి చంపేసిన ప్రేమికుడు - A CASE OF SUSPICIOUS DEATH NALGONDA

Cheating With Love Case: సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటారు. కుదిరితే పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ పెళ్లి చేసుకోమ్మంటే అది నచ్చని యువకుడు పథకం ప్రకారం వ్యుహం రచించి ఆ యువతిని హతమార్చాడు. ఈ దుర్ఘటన నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలంలో చోటు చేసుకుంది. | Read More

ETV Bharat Live Updates - DAMERACHARLA MURDER CASE

04:43 PM, 25 Sep 2024 (IST)

అకౌంట్స్​ అధికారులపై ప్రశ్నల వర్షం - కాళేశ్వరానికి నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపుల అంశాలపై కమిషన్‌ ఆరా - Kaleshwaram Finance Officer Inquiry

Kaleshwaram Commission Investigate On Finance Officers : కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక క్రమశిక్షణా వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని కమిషన్ ఫైనాన్స్ అధికారులను ప్రశ్నించింది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ​కార్పొరేషన్ ఏర్పాటు, ఉద్యోగుల జీతాలు, చెల్లింపులపై ఆరా తీసింది. విచారణలో భాగంగా పీసీ ఘోష్‌ కమిషన్ ముందు పలువురు ఫైనాన్స్​ అధికారులు ఇవాళ హాజరయ్యారు. | Read More

ETV Bharat Live Updates - జస్టిస్​ పీసీ ఘోష్​ విచారణ

03:36 PM, 25 Sep 2024 (IST)

హైదరాబాద్‌లో భారీవర్షం - పలు జిల్లాలో ఎల్లో అలర్ట్ - Heavy Rains In Hyderabad

Heavy Rains In Telangana : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వరద నీటితో రహదారులన్నీ జలమయ్యాయి. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. | Read More

ETV Bharat Live Updates - HEAVY RAINS IN TELANGANA

03:11 PM, 25 Sep 2024 (IST)

బంగాళాఖాతం ఉగ్రరూపం! - ఈ నైరుతిలో ఎనిమిది అల్పపీడనాలు - Review on Rains and Ocean Situation

Review on Rains and Ocean Situation: జూన్‌ 28, జులై 15, 19, ఆగస్టు 3, 29, సెప్టెంబరు 5, 13, 23. ఏంటీ ఈ తేదీలు అనుకుంటున్నారా? బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడిన రోజులు! రుతు పవనాల సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు సాధారణమే అయినా, వాటి సంఖ్య ఇంతలా పెరగడం, వెంట వెంటనే ఏర్పడటం, తీవ్ర రూపం దాల్చి, తుపాన్లుగా మారడం, కుంభవృష్టి కురిపించడాన్ని 'అసాధారణం'గా విశ్లేషిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - REVIEW ON RAINS AND OCEAN SITUATION

03:04 PM, 25 Sep 2024 (IST)

నిరుద్యోగులు డిమాండ్‌ - సప్లయ్‌ సూత్రం గుర్తుంచుకోవాలి : సీఎం రేవంత్‌రెడ్డి - CM REVANTH LAUNCH BFSI COURSES

BFSI Courses Launches in Telangana : చదివిన డిగ్రీకి, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు గ్యాప్ ఉంటోందని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. నాలెడ్జ్‌, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని, ఎంత చదువుకున్నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఉద్యోగాలు రావని తెలిపారు. ఈమేరకు మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్‌ ప్రోగ్రామ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్​ నేర్చుకోవాలన్న ఆయన, అందుకు కావాల్సిన నైపుణ్యాలు అందించే బాధ్యత తామే తీసుకుంటామని ప్రకటించారు. | Read More

ETV Bharat Live Updates - BFSI COURSES IN TELANGANA

03:02 PM, 25 Sep 2024 (IST)

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్ - Uttam Kumar Tour In Mahbubnagar

Minister Uttam Kumar Reddy Tour In Mahabubnagar : దశాబ్దాలుగా వెనుకబడిన, వలసలకు పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని ఈ శాసనసభ కాలంలోనే పూర్తి చేసి 12లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల పరిశీలను పరిశీలించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్థిక, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని ఉదండాపూర్ జలాశయాన్ని ఆయన సందర్శించారు. | Read More

ETV Bharat Live Updates - UTTAM KUMAR MAHBUBNAGAR VISIT

03:02 PM, 25 Sep 2024 (IST)

బైక్​పై కొందరి యువకుల స్టంట్స్ - మరి కొందరి జంటల రొమాన్స్​ - Young People Bike Stunts in Kadapa

Romance on bike : కడప​ టౌన్​ శివార్లలో బైక్​ రేసింగ్ సర్వసాధారణమైంది. యువకులు సామాజిక మాధ్యమాల్లో లైక్​లు, షేర్ల కోసం ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఓ ప్రేమజంట బైక్​పై వెళ్తూ రొమాన్స్ చేసిన తీరుతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. | Read More

ETV Bharat Live Updates - BIKE STUNTS IN KADAPA DISTRICT

01:38 PM, 25 Sep 2024 (IST)

ఎఫ్​టీఎల్ పరిధి ఎంత వరకు? - ఓఆర్ఆర్ అవతలివైపు హైడ్రా ఫోకస్ - FTL LIMITS IN HYDERABAD

Collectors Focused On FTL Limits In Hyderabad : గ్రేటర్‌ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇకపై ఔటర్ రింగ్‌ రోడ్డు దాటి బుల్డోజర్లతో విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) బయట ఉన్న ప్రతి చెరువు, నాలాల్లో ఆక్రమణల వివరాలను నిర్ధారించి నోటిఫికేషన్ జారీ చేయడంలో ఐదు జిల్లాల కలెక్టర్లు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 71 చెరువులను నిర్ధారించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఎఫ్‌టీఎల్‌ వివరాలతో పాటు మ్యాప్‌లను కూడా జతచేసి హెచ్‌ఎండీఏకి కలెక్టర్లు పంపించారు. | Read More

ETV Bharat Live Updates - COLLECTORS FOCUSED ON FTL LIMITS

01:17 PM, 25 Sep 2024 (IST)

అత్యాచారం కేసు - పోలీసు కస్టడీకి జానీ మాస్టర్‌ - JANI MASTER 4 DAYS CUSTODY

Jani Master Police Custody : అసిస్టెంట్ కొరియోగ్రాఫర్​పై అత్యాచారం, లైంగిక్ వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టయిన విషయం తెలిసిందే. తాజాగా రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 28వ తేదీ వరకు నార్సింగి పోలీసులు జానీ మాస్టర్​ను ప్రశ్నించనున్నారు. | Read More

ETV Bharat Live Updates - JANI MASTER POLICE CUSTODY

12:22 PM, 25 Sep 2024 (IST)

అమీన్‌పూర్‌ చెరువుపై హైడ్రా ఫోకస్ - నవ్య చౌరస్తాలో భవనం కూల్చివేత - HYDRA DEMOLITIONS IN SANGAREDDY

Hydra Demolitions At Ameenpur Pond : సంగారెడ్డి జిల్లాలో అమీన్‌పూర్‌ పెద్దచెరువును హైడ్రా అధికారులు సర్వే చేశారు. గతంలో ఇక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా అధికారులు, మరిన్ని కూల్చివేతలకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే నవ్య చౌరస్తాలో అక్రమంగా కట్టిన భవనాన్ని రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. | Read More

ETV Bharat Live Updates - HYDRA FOCUS ON AMMENPUR CHERUVU

12:19 PM, 25 Sep 2024 (IST)

YUVA: నాటుకోళ్లతో రూ.కోట్ల సంపాదన​ - ఈ యంగ్ టెకీ బిజినెస్ ఐడియా అదుర్స్ - COUNTRY CHICKEN CO IN HYDERABAD

Country Chicken Co in Hyderabad : ఐఐటీలో బీటెక్‌ లక్షల ప్యాకేజీతో అవకాశాలు. అయినా వాటన్నింటినీ వదులుకుని వ్యాపార ఆలోచన చేశాడు హైదరాబాద్‌కు చెందిన గొడిశల సాయికేష్‌ గౌడ్‌. మిత్రుడితో కలిసి "కంట్రీ చికెన్ కో" పేరిట నాటు కోళ్ల వ్యాపారం మొదలు పెట్టాడు. తనకంటూ ఓ మోడల్‌, మార్కెట్‌ సృష్టించుకుని ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు సాగిస్తున్నాడు. 5 ఔట్‌లెట్లను దిగ్విజయంగా నడిపిస్తూ ఏడాదికి రూ.16 కోట్ల టర్నోవర్‌ సాధించాడు. అసలు బీటెక్‌ చేసిన అతడికి ఈ ఆలోచన ఎందుకొచ్చింది ? ఎలాంటి ప్రణాళికలతో సక్సెస్‌ఫుల్‌గా అంకురాన్ని నడుపుతున్నాడు? ఆ యువ వ్యాపారవేత్త మాటల్లోనే తెలుసుకుందాం. | Read More

ETV Bharat Live Updates - COUNTRY CHICKEN CO IN HYDERABAD

11:55 AM, 25 Sep 2024 (IST)

తిరుమల వివాదం - యాదాద్రి లడ్డూపై అధికారుల కీలక నిర్ణయం - YADADRI LADDU QUALITY TEST IN HYD

Yadadri Laddu Ghee Quality Checking in Hyderabad: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారడంతో ఇతర ఆలయాల్లో ప్రసాదాల కొనుగోలుకు భక్తులు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ప్రసాదం నాణ్యతపై ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లడ్డూలో వాడే నెయ్యిని హైదరాబాద్​ ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే తయారీలో వినియోగిస్తామని తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - YADADRI LADDU GHEE TEST IN HYD

09:44 AM, 25 Sep 2024 (IST)

నాతో చేతులు కలపండి - ప్రభుత్వ సంకల్పంలో భాగం అవ్వండి : ఎన్టీఆర్‌ - NTR on Drugs Awareness

NTR on Drugs Awareness : మాదక ద్రవ్యాలకు ఆకర్షితులై ఎంతోమంది యువత తమ జీవితాలను నాశం చేసుకుంటున్నారని టాలీవుడ్‌ హీరో ఎన్టీఆర్‌ అన్నారు. డ్రగ్స్ రహిత లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పిలుపునిచ్చారు. | Read More

ETV Bharat Live Updates - NTR ON DRUG ADDICTION

09:00 AM, 25 Sep 2024 (IST)

వడ నుంచి 'లడ్డూ'గా మారిన తిరుమల ప్రసాదం - శ్రీవారి నైవేద్యాల గురించి మీకు తెలుసా? - Tirumala Laddu History

Tirumala Laddu History : తిరుపతి దర్శనమంటే భక్తులకు మధురానుభూతి. శ్రీవారి ప్రసాదాన్ని ఎంతో అపూరూపంగా భావిస్తారు. శతాబ్దాల కిందట శ్రీవారి ప్రసాదంగా 'వడ'ను అందించేవారు. ఆ తర్వాత బూందీ లడ్డూ ప్రసాదాన్ని ప్రారంభించారు. ఇక ఇప్పుడు లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. మరి శ్రీవారికి నైవేద్యం ఎప్పటినుంచి ప్రారంభమైంది? ఏయే ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించే వారు? లడ్డూ ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారు? ఏయే వస్తువులు ఉపయోగిస్తారు? తెలుసుకుందాం రండి. | Read More

ETV Bharat Live Updates - TIRUMALA LADDU HISTORY

08:46 AM, 25 Sep 2024 (IST)

పిల్లల కోసం దాచిన సొమ్మంతా పోగొట్టావ్ - కాపురాల్లో 'సైబర్ క్రైమ్' చిచ్చు - Cyber Crime Impact on Families

Cyber Crime Impact on Families : సైబర్‌ నేరాలు పచ్చటి కాపురాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. లాభాల కోసం ఆశపడి మోసపోయిన బాధితుల పట్ల కుటుంబ సభ్యుల సూటిపోటి మాటలు మరింత మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. చివరకు భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. పిల్లల చదువులు, వివాహాల కోసం జమ చేసుకున్న సొమ్మంతా పోగొట్టావంటూ మొదలవుతున్న కలహాలు మానవ బంధాలను మరింత దిగజారుస్తున్నాయి. | Read More

ETV Bharat Live Updates - CYBER CRIME INFLUENCE RELATIONSHIPS

07:45 AM, 25 Sep 2024 (IST)

యూట్యూబర్‌ హర్షసాయిపై రేప్ కేసు నమోదు - Rape Case on youtuber Harsha Sai

Rape Case on Youtuber Harsha Sai : యూట్యూబర్‌ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని ఓ యువతి నార్సింగి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. | Read More

ETV Bharat Live Updates - YOUTUBER HARSHA SAI NEWS LATEST

07:09 AM, 25 Sep 2024 (IST)

బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సులకు నేడే శ్రీకారం - ప్రారంభించనున్న సీఎం రేవంత్​రెడ్డి - BFSI COURSES LAUNCH IN TELANGANA

BSFI Courses Launch In Telangana Today : డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఏటా అనేకమంది విద్యాసంస్థల నుంచి బయటకొస్తున్నారు. ఉద్యోగాలు మాత్రం సాధించలేకపోతున్నారు. పరిశ్రమల అవసరాలకు సరిపడేలా శిక్షణ అందిస్తే కొలువులు సంపాదించవచ్చు. ఇందులో భాగంగానే బీఎఫ్​ఎస్​ఐ(బ్యాకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌) రంగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకు సర్కారు శ్రీకారం చుట్టనుంది. ప్రత్యేకంగా మైనర్ డిగ్రీ కోర్సులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. | Read More

ETV Bharat Live Updates - BFSI COURSES IN TELANGANA

07:05 AM, 25 Sep 2024 (IST)

సర్వస్వం కోల్పోయాం - మా మొర ఆలకించండి సారూ- ఉద్దండపూర్ నిర్వాసితుల ఆందోళన - Uddandapur Land Dwellers Protest

Uddandapur Land Dwellers Protest : వారంతా సాగునీటి ప్రాజెక్టుల కోసం సర్వస్వం త్యాగం చేశారు. భూములు, ఇళ్లు, పొలాలు వదులుకున్నారు. ప్రాజెక్టు పనులు చకాచకా అయ్యాయిగానీ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం అరకొరగానే అందాయి. వాగ్దానాలు చేసిన ప్రజాప్రతినిధులు, హామీలిచ్చిన అధికారులు మారారు గానీ, నిర్వాసితుల తలరాతలు మారలేదు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ప్రాజెక్టు పనులు ముందుకు సాగనివ్వమని ఉద్దండపూర్ జలాశయ నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు పాలమూరు పర్యటనకు వస్తున్న మంత్రులను మా మొర ఆలకించండంటూ వేడుకుంటున్నారు. | Read More

ETV Bharat Live Updates - PALAMURU RANGAREDDY LIFT PROJECT
Last Updated : Sep 25, 2024, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details