పాయల్ శంకర్
- 2014 ముందు రైతులే లేనట్లు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మాట్లాడుతున్నాయి
- మేమే వ్యవసాయాన్ని సృష్టించినట్లు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మాట్లాడుతున్నాయి
- వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశం
- రాష్ట్రంలో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది
- వ్యవసాయానికి కేంద్రం చేసిన సాయం గురించి ఎవరూ మాట్లాడట్లేదు
- రాజకీయాలంటే దూషించుకోవడమే అనేలా మాట్లాడుతున్నారు
- ఈ రోజు పత్తికి మార్కెట్‌లో ధర లేదు
- సీసీఐ పత్తి కొనకుంటే లక్షల మంది రైతులు రోడ్డున పడేవారు
- కేంద్రం సాయంతో 1.20 కోట్ల టన్నుల పత్తిని సీసీఐ తీసుకుంది
- సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక్క రూపాయి లేదు
- పీఎం కిసాన్ ద్వారా వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కేంద్రం ఇస్తోంది
- మోదీ ఇస్తున్న పైసలు వస్తున్నాయి.. రాష్ట్రం నుంచి మాత్రం పైసలు రావట్లేదని రైతులు మాట్లాడుకుంటున్నారు
- జనవరి నుంచి రైతుభరోసా ఇస్తామన్నారు... సంతోషం
- టమాట ధర రూ.15కి పడిపోయింది
- రైతు ఈనాటికీ సంతోషంగా లేడు
- ఐదెకరాలున్న రైతు ఏడాది కష్టపడితే రూ.50 వేలు కూడా మిగలట్లేదు
- రైతుల పిల్లలు కార్పొరేట్ స్కూల్‌లో చదివినా.. ఆస్పత్రికి వెళ్లినా 90 శాతం భారం ప్రభుత్వమే భరించాలి