తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 18 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Wed Sep 18 2024 లేటెస్ట్‌ వార్తలు- మిషన్​ చబుత్ర, ఆపరేషన్​ రోమియో నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ - Telangana HC on Operation Chabutra

By Telangana Live News Desk

Published : Sep 18, 2024, 8:15 AM IST

Updated : Sep 18, 2024, 10:42 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

10:41 PM, 18 Sep 2024 (IST)

మిషన్​ చబుత్ర, ఆపరేషన్​ రోమియో నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ - Telangana HC on Operation Chabutra

Chabutra Mission Program in Telangana : మిషన్​ చబుత్ర, ఆపరేషన్​ రోమియో నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. ఈ రెండు పేర్లతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త మసూద్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు వివరణ ఇచ్చింది. | Read More

ETV Bharat Live Updates - CHABUTRA MISSION PROGRAM IN TG

10:24 PM, 18 Sep 2024 (IST)

'ఒకసారి తేల్చిన అంశంపైనే మరోసారి పిటిషన్ ఎలా వేస్తారు' - బీఆర్​ఎస్​ ఆఫీస్​ కూల్చివేత వివాదంపై హైకోర్టు సీరియస్ - TG HC on BRS Office in Nalgonda

TG HC on Nalgonda BRS Office : నల్గొండ జిల్లాలో బీఆర్​ఎస్​ భవనం క్రమబద్ధీకరణ వివాదంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే పార్టీ భవనం క్రమబద్ధీకరణపై తీర్పు ఇవ్వగా తిరిగి అదే అభ్యర్థనపై రెండోసారి పిటిషన్ దాఖలు ఎలా చేస్తారని నిలదీసింది. మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన కూల్చివేత ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు లక్ష రూపాయలు ఖర్చుల కింద నల్గొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. | Read More

ETV Bharat Live Updates - NALGONDA BRS OFFICE NEWS

10:16 PM, 18 Sep 2024 (IST)

ఆ 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వండి : హైకోర్టు - HC on Merger of Gram Panchayats

Telangana High Court Notice to Govt : ఓఆర్​ఆర్​ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడం వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నోటీసులను జారీ చేసింది. మరోవైపు హైడ్రాకు కూడా నోటీసులు జారీ చేసింది. | Read More

ETV Bharat Live Updates - TELANGANA HC ON HYDRA

09:21 PM, 18 Sep 2024 (IST)

కరివేపాకే అని తీసేస్తున్నారా ? అయితే మీరు చాలా మిస్​ అవుతున్నట్లే ! - Health Benefits of Curry Leaves

Curry Leaves Health Benefits : తాలింపులో రెండు కరివేపాకు రెమ్మల్ని దూసి వేశామంటే చిటపటమంటూనే ఘుమఘుమలతో వంటకం రుచి అదిరిపోవాల్సిందే. కానీ తినేటప్పుడు మాత్రం ఆ ఆకుల్ని తీసి పక్కనపెట్టేస్తారు. అది చేసే మేలేంటో తెలుసుకున్నారంటే కరివేపాకే కదా అని తీసి పారేయకుండా కాస్త ఆలోచనలో పడతారు. దీని గొప్పతనం తెలిసిన సౌందర్య నిపుణులు సైతం ఇప్పుడు కరివేపాకు నూనెల దగ్గర్నుంచి షాంపూల వరకూ ఎన్నో ఉత్పత్తుల్ని తీసుకొస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - CURRY LEAVES BENEFITS

09:19 PM, 18 Sep 2024 (IST)

పార్వతీ తనయునికి ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు - రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నిమజ్జన క్రతువు - Ganesh Immersion in hyderabad

GHMC Sanitation Workers Cleaning On Hyderabad City Roads : రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌ నిమజ్జన క్రతువు ప్రశాంతంగా ముగిసింది. పార్వతీ తనయునికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. నవరాత్రులు విశేష పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరారు. హైదరాబాద్‌లో ఓ పక్క నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుండగా, మరోపక్క పారిశుద్ధ్య కార్మికులు రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు తొలగించే ప్రక్రియను ముమ్మరం చేశారు. | Read More

ETV Bharat Live Updates - GANESH IMMERSION 2024

07:49 PM, 18 Sep 2024 (IST)

ఎప్పుడైనా తెలంగాణ సర్వపిండి తిన్నారా! తింటే వదిలిపెట్టరు - పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు - telangana sarvapindi making telugu

SarvaPindi Recipe Making in Telugu : ఎప్పుడైనా తెలంగాణ సర్వపిండిని రుచి చూశారా? ఒక్కసారి తింటే వదిలిపెట్టరు సుమా! ఇంత రుచికరమైన సర్వపిండిని కేవలం పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. అదెలాగో చూసేయండి. | Read More

ETV Bharat Live Updates - SARVAPINDI RECIPE MAKING IN TELUGU

07:26 PM, 18 Sep 2024 (IST)

చంద్రబాబు ఓపిక ఆశ్చర్యపరుస్తోంది - సీఎం నాయకత్వంలో పని చేయడం సంతోషం : పవన్​ కల్యాణ్​ - PAWAN KALYAN ABOUT CM CHANDRA BABU

Pawan Kalyan Comments on CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కేవలం 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామన్నారు. ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా వస్తే నన్ను చాలా ఇబ్బంది పెట్టారన్నారు. కూటని నేతల సమష్టి కృషితోనే ఎన్నికల్లో భారీ మోజార్టీతో గెలిచామని తెలిపారు. చంద్రబాబుకు భయం లేదు, ఆయన్ని ఎన్ని అవమానాలకు గురిచేసినా అధైర్య పడలేదని కొనియాడారు. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో పవన్ పవన్ కల్యాణ్ పాల్కొన్నారు. | Read More

ETV Bharat Live Updates - NDA LEGISLATIVE PARTY MEETING

07:11 PM, 18 Sep 2024 (IST)

టీ పొంగిపోకుండా ఉండాలా? - మీ కిచెన్​లో ఇది ఉంటే ఇక నో టెన్షన్ - New Chai Maker For Tea

New Chai Maker For Tea : మనలో చాలామందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. కొందరికైతే ఏకంగా టీ తాగనిదే రోజు అస్సలు మొదలవదు. టీ తాగడం వరకు ఓకే. కానీ టీ పెట్టడమంటే మాత్రం కొందరికి చిరాకు. ఎందుకంటే టీ రెడీ అయ్యే వరకు స్టవ్​ దగ్గర నిల్చోవాల్సిందే. అక్కడి నుంచి కాస్త పక్కకు జరిగామో మొత్తం పొంగిపోతాయి. అయితే అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. | Read More

ETV Bharat Live Updates - LOKA CHAI MAKER IN INDIA

05:54 PM, 18 Sep 2024 (IST)

జానీ మాస్టర్​ కేసులో కొత్త ట్విస్ట్ - పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు - Joni Master rape case Latest News

Joni Master Latest News : అత్యాచారం కేసులో డ్యాన్స్​ మాస్టర్​ జానీ మాస్టర్​కు బిగ్​ షాక్ తగిలింది​. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనపై పోక్సో యాక్ట్​ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్​గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్​ తనపై లైంగికంగా దాడి చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. | Read More

ETV Bharat Live Updates - RAPE CASE AGAINST JONI MASTER

05:56 PM, 18 Sep 2024 (IST)

ఐఈఎల్‌టీఎస్‌ అవసరం లేకుండా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు - ఆ దేశాల వివరాలేంటో తెలుసా? - Study Abroad Without IELTS

Students Study Abroad Without IELTS 2024 : విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఆంగ్లభాషా ప్రావీణ్య పరీక్షల ప్రాముఖ్యం తెలుసు. అందులో మంచి స్కోరు సంపాదించి ఉన్నత విద్యాసంస్థలో సీటు తెచ్చుకోవాలని ఆశపడుతుంటారు. కానీ కొన్ని దేశాల్లో ఈ పరీక్షతో అవసరం లేకుండానే చదువుకునే వీలుందని తెలుసా? ఎటువంటి స్కోరూ అవసరం లేకుండా నేరుగా యూనివర్శిటీ నిబంధనలు అనుసరించి ప్రవేశాలు పొందవచ్చు. ఆ దేశాలు వివరాలు ఏంటో తెలుసుకుందాం. | Read More

ETV Bharat Live Updates - STUDENTS WITHOUT IELTS COUNTRIES

05:53 PM, 18 Sep 2024 (IST)

'ఈ ఎలక్షన్స్​ వాళ్లకే ఉపయోగం - ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుంది' : జమిలి ఎన్నికలపై ఒవైసీ స్పందన - Owaisi on One Nation One Elections

Owaisi on One Nation One Election : జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఎక్స్​ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి అమిత్​ షాకు తప్ప ఎవరికీ బహుళ ఎన్నికలపై సమస్యలు లేవని పేర్కొన్నారు. ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. | Read More

ETV Bharat Live Updates - OWAISI ON PM MODI

05:01 PM, 18 Sep 2024 (IST)

'దేవర కథ ఇదేనా? కొరటాల తన స్క్రీన్​ప్లేతో ప్రేక్షకుల ఆలోచనలతో ఆడుకోవడం ఖాయమేనా' - paruchuri gopalakrishna talk devara

Devara Part -1 Trailer Telugu Comments : దేవర పార్ట్​-1 ట్రైలర్​ విడుదలైన దగ్గర నుంచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ అంచనాలతో సెప్టెంబర్​ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండేళ్ల తర్వాత ఎన్టీఆర్​ బిగ్​స్క్రీన్​పై కనిపిస్తుండటంతో ఫ్యాన్స్​​లోనూ ఆత్రుత కనిపిస్తోంది. అయితే దేవర ట్రైలర్​పై తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఒక ప్రత్యేకమైన వీడియోను రిలీజ్​ చేశారు. అది సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. | Read More

ETV Bharat Live Updates - DEVARA

04:36 PM, 18 Sep 2024 (IST)

మొగుడు టైమ్​కి ఇంటికి రానక్కర్లేదు - ఫ్రెండ్స్ తో మందు కొట్టొచ్చు - పెళ్లి అగ్రిమెంట్ వైరల్! - TAMILNADU VIRAL MARRIAGE AGREEMENT

TAMIL MARRIAGE AGREEMENT : పెళ్లి ముచ్చట తీరిన తర్వాత మెజారిటీ మగాళ్లది ఒకటే బాధ. సాయంత్రం కాగానే ఇంటికి వెళ్లాలి.. ఫ్రెండ్స్​తో నో సిట్టింగ్.. టూర్లు, షికార్లు అన్నీ బంద్.. ఇలా ఎన్నో రిస్ట్రిక్షన్స్​తో జీవితం మొత్తం మారిపోయిందంటూ కుమిలిపోతుంటారు. ఇలాంటి పరిస్థితి తనకు రాకుండా ముందు జాగ్రత్తపడ్డాడో పెళ్లికొడుకు. ఏకంగా పెళ్లిలోనే వధువుతో బాండ్ రాయించుకున్నాడు. మరి.. అందులో ఏముందో తెలుసా? | Read More

ETV Bharat Live Updates - TAMIL MARRIAGE AGREEMENT

04:08 PM, 18 Sep 2024 (IST)

1వ తేదీన సెలవు దినంగా ఉంటే - ఇకపై ముందు రోజే పింఛన్ల పంపిణీ - Distribution Of Pension In AP

AP Pension Distribution New Guidelines 2024 : ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పింఛను పంపిణీ మార్గదర్శకాల్లో పలు సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నెల మొదటి రోజు (1వ తేదీ) సెలవు దినంగా ఉంటే పింఛన్​ సొమ్మును ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందిస్తామని తెలిపింది. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. | Read More

ETV Bharat Live Updates - AP PENSION DISTRIBUTION

03:52 PM, 18 Sep 2024 (IST)

'ఆ నిర్మాత నన్ను గోవాకు రమ్మన్నాడు - ఇబ్బందికరంగా ప్రవర్తించాడు' - Sexual Harassments in Sandalwood

Sexual Harassments in Kannada Industry : మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి ఇటీవల విడుదల చేసిన జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక అంతటా వైరల్​గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నడ చిత్ర పరిశ్రమలోనూ మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఆ ఇండస్ట్రీకి చెందిన నటి నీతూశెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ నిర్మాత తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని షాకింగ్​ విషయాలు బయటపెట్టారు. | Read More

ETV Bharat Live Updates - SEXUAL ASSAULTS IN KANNADA INDUSTRY

03:25 PM, 18 Sep 2024 (IST)

2 నెలల్లో తెలుగు సబ్జెక్టు పూర్తి చేయాల్సిందే - పదో తరగతి విద్యార్థులకు సిలబస్ సమస్య - STUDENTS FACE PROBLEMS

Students Face Syllabus Problems : ఆంధ్రప్రదేశ్​లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు తలనొప్పిగా మారింది. సీబీఎస్‌ఈలో పాత తెలుగు పాఠ్యపుస్తకం చదివిన విద్యార్థులు ఇప్పుడు రాష్ట్ర బోర్డుకు మారినందున తెలుగు కొత్త పుస్తకం చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండున్నర నెలల్లోనే తెలుగు సబ్జెక్టును పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. | Read More

ETV Bharat Live Updates - TELUGU SYLLABUS ISSUE IN AP

03:18 PM, 18 Sep 2024 (IST)

ఎంఎస్​ఎంఈలు అభివృద్ధి చెందడం ద్వారానే రాష్ట్రాల వృద్ధి : సీఎం రేవంత్​ రెడ్డి - MSME New Policy Programme in Hyd

Telangana Govt Launch MSME New Policy : వ్యవసాయం అనేది పండుగ, దండుగ కాదు. ఇదే తమ ప్రభుత్వ నినాదమని సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. యువతకు వ్యవసాయం, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయూతనిస్తామని వెల్లడించారు. ఎంఎస్​ఎంఈలు అభివృద్ధి చెందడం ద్వారానే రాష్ట్రాలు వృద్ధి చెందుతాయని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. | Read More

ETV Bharat Live Updates - TG GOVT LAUNCH MSME NEW POLICY

01:35 PM, 18 Sep 2024 (IST)

రూ.99కే సినిమా టికెట్‌ - ఆ ఒక్కరోజు మాత్రమే ఈ బంపర్​ ఆఫర్! - Rs 99 Movie Ticket Offer

Rs 99 Movie Ticket Offer : జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా పలు మల్టీప్లెక్స్‌లో సినీ ప్రియులకు గ్రాండ్ ఆఫర్ లభించనుంది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు (20-09-2024) మూవీ టికెట్‌ రూ.99కే లభించనుంది. ఆ ఒక్కరోజు మాత్రమే టికెట్​పై బంపర్​ ఆఫర్ ఇవ్వనున్నట్లు ఎమ్​ఏఐ తెలిపింది. అలానే కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో చూసేయండి మరీ! | Read More

ETV Bharat Live Updates - NATIONAL CINEMA DAY MOVIE TICKETS

01:19 PM, 18 Sep 2024 (IST)

విమానాలు ఎక్కడంలో బిజీ అయిన రేవంత్ విధులు విస్మరిస్తున్నారు : కేటీఆర్ - KTR SLAMS CM REVANTH REDDY

KTR on CM Revanth Delhi Tours : సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమై, తన విధులను విస్మరిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంపుల మునకపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. | Read More

ETV Bharat Live Updates - KTR ON VATTEM PUMPHOUSE SUBMERGED

01:13 PM, 18 Sep 2024 (IST)

హుస్సేన్‌సాగర్‌లో 5,500 విగ్రహాలు నిమజ్జనం : సీపీ సీవీ ఆనంద్ - CP Anand On Ganesh Immersion

CP Anand On Ganesh Immersion In Hyderabad : హైదరాబాద్​లో వినాయకుని నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో 5,500 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని వెల్లడించారు. గణేశ్‌ నిమజ్జనం త్వరగా పూర్తిచేసేందుకు 25వేల మంది సిబ్బంది నిర్విరామంగా కృషి చేశారని చెప్పారు. | Read More

ETV Bharat Live Updates - GANESH IMMERSION IN HYDERABAD

11:20 AM, 18 Sep 2024 (IST)

ఆపరేషన్ థియేటర్​లో 'అదుర్స్' - రోగికి 'సినిమా' చూపించారు మావా - PATIENT WATCHED ADHURS IN OT

Patient Watched Adhurs Movie During Suregery : 'సినిమా చూపిస్తూ సర్జరీ' వినేందుకు కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజమేనండీ. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిళా రోగికి ఇష్టమైన సినిమా చూపిస్తూ సర్జరీని విజయవంతగా జరిపారు వైద్యులు​. క్లిష్టమైన సర్జరీ అనగానే అందరికీ టక్కున గుర్తుచ్చేదీ కార్పొరేట్ ఆసుపత్రే కానీ, తెలివికి, టాలెంట్​కు ఢోకా లేని ఎంతోమంది అత్యుత్తమ వైద్యులు సర్కారీ ఆసుపత్రుల్లోనూ విధులు నిర్వహిస్తుంటారు. ఇదే విషయాన్ని కాకినాడలోని సర్వజన ఆసుపత్రి వైద్య బృందం తాజా సర్జరీతో నిరూపించారు. అరుదైన చికిత్స చేసి వైద్యులు ఓవైపు ప్రశంసలందుకుంటుంటే, మరోవైపు సినిమాల ప్రభావం మామూలుగా లేదు కదా అంటూ నెటిజన్లు అవాక్కవుతున్నారు. | Read More

ETV Bharat Live Updates - KAKINADA GGH RARE TREATMENT

10:36 AM, 18 Sep 2024 (IST)

పచ్చని పొలాల్లో ఇసుక మేటలు - కర్షకుల కళ్లల్లో కన్నీటి ఊటలు - Sand Dunes in Crop Lands

Telangana Floods Effect 2024 : పది రోజుల కింది వరకు పచ్చని పంటలతో కళకళలాడిన పొలాలు! ఇప్పుడు ఎటుచూసినా ఇసుక మేటలు, రాళ్లు రప్పలు దర్శనమిస్తున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన పంట పొలాలు, ఇప్పుడు కనీసం ఆనవాళ్లు లేకుండా ఎడారిని తలపిస్తున్నాయి. సుమారు 5 అడుగుల మేర వేసిన ఇసుక మేటలు, కర్షకుల గుండెల్ని పిండేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల రైతుల వేదన వర్ణనాతీతంగా మారింది. | Read More

ETV Bharat Live Updates - పచ్చని పొలాల్లో ఇసుక మేటలు

10:03 AM, 18 Sep 2024 (IST)

మందుబాబులకు కిక్కే కిక్కు- సరసమైన ధరలకే లిక్కర్! - NEW LIQUOR POLICY IN AP

New Excise Policy 2024 in AP : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన మద్యం విధానంలో, సరసమైన ధరలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అలాగే గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు పేర్కొంది | Read More

ETV Bharat Live Updates - ఏపీ లిక్కర్ పాలసీ 2024

09:28 AM, 18 Sep 2024 (IST)

నిత్యావసర సరకుల ధరలు పైపైకి - దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో - ESSENTIALS RATES HIKE IN TELANGANA

Essentials Rates Increased in Telangana : దేశంలో సగటు వ్యక్తి ఆదాయం గత 12 ఏళ్లలో రెట్టింపైనా జీవన ప్రమాణాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. సామాన్యుల రోజువారీ జీవనానికి కావాల్సిన నిత్యావసర వస్తువుల నుంచి వైద్యం వరకూ ఖర్చులు అంతే స్థాయిలో పెరిగాయి. దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఈ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కేంద్రం తాజాగా విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టు నివేదిక పలు అంశాలను స్పష్టం చేసింది. | Read More

ETV Bharat Live Updates - CONSUMER PRICE INDEX 2024

09:07 AM, 18 Sep 2024 (IST)

రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం - పరిశ్రమ పెట్టాలంటే ఇక స్థలం కొనక్కర్లేదు! - MSME Encourage Policy in Telangana

CM Revanth Focus On Industries Development : రాష్ట్రంలో పరిశ్రమలు, పారిశ్రామిక విధానం విషయంలో తమదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో వడివడిగా అడుగులు వేస్తోంది రేవంత్​ సర్కార్. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి భరోసా కల్పిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంఎస్‌ఎంఈల పటిష్ఠతకు పెద్ద పీఠ వేస్తూ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. | Read More

ETV Bharat Live Updates - TELANGANA INDUSTRIAL POLICY

08:09 AM, 18 Sep 2024 (IST)

ఫ్యూచర్‌ సిటీలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సన్నాహాలు - 8 వేల ఎకరాల భూసేకరణ - Land Acquisition for Future City

Congress Govt Focus On Future City : అవకాశాల గమ్యస్థానం హైదరాబాద్ మహానగరానికి అనుబంధంగా మరో నూతన​ నగరం నిర్మాణం కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా, రేవంత్​ సర్కార్​ తెరపైకి తీసుకొచ్చిన ఈ ఫ్యూచర్‌ సిటీకి కావలసిన గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. | Read More

ETV Bharat Live Updates - ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫీల్డ్ రోడ్

07:15 AM, 18 Sep 2024 (IST)

లైంగిక వేధింపుల ఆరోపణలు - జానీ మాస్టర్​కు తెలుగు ఫిలిం ఛాంబర్ షాక్ - JANI MASTER CONTROVERSY

Jani Master Controversy : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ ఉదంతంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా, టాలీవుడ్‌లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ కూడా తీవ్రంగా స్పందించింది. కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీ మాస్టర్‌ను తాత్కాలికంగా తప్పించాలని సిఫారసు చేసిన కమిటీ, పని ప్రదేశాల్లో మహిళలకు చలన చిత్ర పరిశ్రమ ధైర్యాన్ని ఇవ్వలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమలో మహిళలు వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కమిటీ స్పష్టం చేసింది.. | Read More

ETV Bharat Live Updates - జానీ మాస్టర్ వివాదం
Last Updated : Sep 18, 2024, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details