ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 16 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Mon Sep 16 2024 లేటెస్ట్‌ వార్తలు- సంక్షోభ హాస్టళ్లుగా సంక్షేమ వసతిగృహాలు, సమస్యలకు నిలయాలుగా గురుకులాలు- సీఎంకు హరీశ్‌రావు లేఖ - Harish Rao On CM Revanth

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Telangana Live News Desk

Published : Sep 16, 2024, 8:15 AM IST

Updated : Sep 16, 2024, 10:45 PM IST

10:44 PM, 16 Sep 2024 (IST)

సంక్షోభ హాస్టళ్లుగా సంక్షేమ వసతిగృహాలు, సమస్యలకు నిలయాలుగా గురుకులాలు- సీఎంకు హరీశ్‌రావు లేఖ - Harish Rao On CM Revanth

Harish Rao on Schools : రాష్ట్రంలో విద్యావ్యవస్థపై ప్రభుత్వానికి పట్టింపులేదని మాజీమంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల్లో కాంగ్రెస్​ పాలన వల్ల ప్రభుత్వ విద్యావ్యవస్థ పతనావస్థకు చేరుకుందని దుయ్యబట్టారు. సంక్షేమ హాస్టళ్లను సంక్షోభ హాస్టళ్లుగా మార్చారని ధ్వజమెత్తారు. ఈ మేరకు హరీశ్​రావు సీఎం రేవంత్​కు బహిరంగ లేఖ రాశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HARISH RAO ON CM REVANTH

10:34 PM, 16 Sep 2024 (IST)

ఖైరతాబాద్‌ మహాగణపతికి కాసుల వర్షం - పదిరోజుల్లో ఆదాయం ఎంతంటే ? - Khairatabad Hundi Got Rs 70 Lakhs

Khairatabad Hundi Amount : వినాయక నవరాత్రుల్లో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. ఈనేపథ్యంలో స్వామివారికి భక్తులు భారీగా కట్న కానుకలు సమర్పించుకున్నారు. సోమవారం నాడు ఖైరతాబాద్ గణేశ్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకులు హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ పదిరోజుల్లో ఖైరతాబాద్‌ వినాయకుడికి భారీగా ఆదాయం వచ్చింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KHAIRATABAD HUNDI AMOUNT LATEST

09:42 PM, 16 Sep 2024 (IST)

రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టుపెట్టడమే : కేటీఆర్ - KTR criticizes CM Revanth Reddy

KTR Slams Congress Party : తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. దీనిపై నిరసనగా రేపు రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KTR COMMENTS ON RAJIV GANDHI STATUE

08:47 PM, 16 Sep 2024 (IST)

"తెలంగాణ ప్రజాపాలన దేనికోసం - ఎవరికి భయపడి విమోచన దినోత్సవం పేరు మార్పు" - Bandi Sanjay Respond To Govt Letter

Union Minister Bandi Sanjay On Liberation Day : ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట అధికారికంగా ఉత్సవాలు నిర్వహించడం లేదని కేంద్ర మంత్రి బండిసంజయ్ ప్రశ్నించారు. పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని, నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. పేరుమార్చడం వల్లే ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి హాజరుకావట్లేదని బండి సంజయ్‌ తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - తెలంగాణ విమోచన దినోత్సవం 2024

07:43 PM, 16 Sep 2024 (IST)

హైదరాబాద్​​ను ప్రపంచ ఫార్మా కంపెనీల క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి శ్రీధర్‌బాబు - Minister Sridhar Babu Meet

Genome Valley Hyderabad : హైదరాబాద్ జీనోమ్‌ వ్యాలీకి మరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా ఫార్మా కంపెనీలకు ప్రోత్సాహకాలు, సకల వసతులు కల్పిస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇవాళ జీనోమ్‌ వ్యాలీలో పెట్టుబడుల విస్తరణపై వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDERABAD PHARMA CITY

07:31 PM, 16 Sep 2024 (IST)

నిమజ్జనాలకు అంతా సెట్ : 25 వేల మంది పోలీసులతో బందోబస్తు - ఆ మార్గాల్లో ట్రాఫిక్​ మళ్లింపులు - Traffic Restrictions for Immersion

Traffic Restrictions in Hyderabad : నగరంలో వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జనం బందోబస్తు కోసం 25 వేల మంది పోలీసులను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. గణేశ్ నిమజ్జనం శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనదారులకు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ పోలీసులు అంక్షలను విధించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GANESH IMMERSION ROUTE IN HYD

07:01 PM, 16 Sep 2024 (IST)

గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్‌ గాంధీ : సీఎం రేవంత్ - Revanth Unveil Rajiv Gandhi Statue

CM Revanth Unveiled Statue Of Rajiv Gandhi : దేశ ప్రజల కోసమే రాజీవ్‌ గాంధీ ప్రధాని పదవి చేపట్టారని, ప్రజలకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాలయం ఎదుట మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఇవాళ ఆయన ఆవిష్కరించారు. అనంతరం సభలో మాట్లాడుతూ, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేత రాజీవ్‌ గాంధీ అని కొనియాడారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CM REVANTH SLAMS ON BRS PARTY

06:46 PM, 16 Sep 2024 (IST)

మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి ఖైరతాబాద్​ గణేశుడు - ఒక్క అడుగు నుంచి 70 అడుగుల ప్రస్థానమిదే - KHAIRATABAD GANESH IMMERSION 2024

Khairatabad Ganesh 2024 : శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా పది రోజుల పాటు భక్తుల నీరాజనాలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జ గణపయ్య నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర ఉద్యమకారుడు తిలక్‌ ప్రేరణతో సింగరి శంకరయ్య అనే వ్యక్తి 1954లో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, నాటి నుంచి నేటి వరకు ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం సాగిందిలా. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GANESH IMMERSION CELEBARATIONS 2024

05:51 PM, 16 Sep 2024 (IST)

2035 నాటికి రాష్ట్రంలో 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తే లక్ష్యం : భట్టి - Deputy CM Bhatti On Green Power

Deputy CM Bhatti Vikramarka On Green Power : తెలంగాణలో స్థిరమైన, విశ్వసనీయమైన గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి సమగ్ర గ్రీన్ పవర్ ఎనర్జీ పాలసీని అభివృద్ధి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు గుజరాత్​లో ఏర్పాటు చేసిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్‌కు హాజరైన భట్టి, వివిధ రిజర్వాయర్ల వద్ద సోలార్ ప్రాజెక్టులకు తెలంగాణ గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపట్టిన గ్రీన్ పవర్ మిషన్ లక్ష్యం సాధించడానికి వివిధ రంగాల్లోని పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు తమతో చేతులు కలపాలని ఆహ్వానించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BHATTI VIKRAMARKA ON GREEN ENERGY

05:11 PM, 16 Sep 2024 (IST)

వ్యవసాయ భూమిలో రాళ్లున్న రైతులకు ఇక ఉపశమనమే! - అందుబాటులోకి మెషిన్​ - Good News For Formers

Stone Removal Machine: మీ పొలంలో రాళ్లు ఉన్నాయా. ఇక చింతించకండి. ఎలాంటి రాళ్ల నేలనైనా చక్కగా సాగు భూమిగా మార్చే యంత్రం ఒకటి రైతులకు అందుబాటులోకి వచ్చింది. కూలీలతో రోజుల తరబడి ఉన్న పలుగు రాళ్లను ఏరించినా సాగుకు అంత అనుకూలంగా ఉండని నేలలో ఈ యంత్రం ద్వారా రాళ్లు ఏరిస్తే గంటల్లో సాగుకు తయారవుతుంది. ఇంతకీ ఆ యంత్రం ఏమిటో? దాన్ని ఎవరూ? అందుబాటులోకి తెచ్చారో తెలుసుకుందామా? | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - STONE REMOVAL MACHINE IN AP

04:46 PM, 16 Sep 2024 (IST)

అక్టోబర్​లో కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ : మంత్రి ఉత్తమ్‌ - Minister Uttam on New Ration Cards

Uttam on New Ration Cards : రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డు, హెల్త్ కార్డు అందించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై మంత్రులు ఉత్తమ్​, పొంగులేటి ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అక్టోబరులో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - NEW RATION CARDS IN TELANGANA

03:06 PM, 16 Sep 2024 (IST)

వినాయక నిమజ్జనాలకు అంతా సిద్ధం - 360 క్రేన్ల ఏర్పాటు : మంత్రి పొన్నం - Minister Ponnam on Ganesh Immersion

Ganesh Immersion 2024 : జీహెచ్​ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు 360 క్రేన్లను సిద్ధం చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులు కూడా శాంతియుతంగా నిమజ్జనం జరిగేలా సహకరించాలని ఆయన కోరారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GANESH IMMERSION IN HYDERABAD

02:40 PM, 16 Sep 2024 (IST)

అక్కడ గజం రూ.లక్ష - అయినా అందరి చూపూ అటు వైపే - Real Estate Business in Hyderabad

Real Estate In Hyderabad : హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. నగరం నలుమూలల మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్న క్రమంలో భూములు, ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఒకప్పుడు కోకాపేట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూముల వైపు చూసేవారు. కానీ ఇప్పుడు నగరవాసులు తూర్పు ఈశాన్యంలో ఉన్న కాప్రా, ఈసీఐఎల్ వైపు చూస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - REAL ESTATE IN HYDERABAD

12:51 PM, 16 Sep 2024 (IST)

ఇల్లు కొనడానికి ఇదే సరైన సమయం! - ఎందుకో తెలుసా? - Real Estate Market in Hyderabad

Present Real Estate Market in Hyderabad 2024 : హైదరాబాద్​లో ఇళ్లు, స్థలాలు కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయమని స్థిరాస్తి రంగ నిపుణులు సూచిస్తున్నారు. గత కొంతకాలంగా ధరలు స్తబ్దుగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో డెవలపర్స్‌తో బేరమాడే అవకాశమూ ఉంటుందని చెబుతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - REAL ESTATE SITUATION IN HYDERABAD

12:08 PM, 16 Sep 2024 (IST)

గణేశ్​ వేడుకలను చూసేందుకని ఫ్రెండ్స్​తో వచ్చి - హోటల్​ గదిలో యువతి ఆత్మహత్య - Gachibowli Young woman Suicide case

Gachibowli Suicide Case : గచ్చిబౌలిలో ఓ హోటల్​లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హోటల్​ గదిలోని ఫ్యాన్​కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆమె స్నేహితులు, హోటల్​ సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GACHIBOWLI SUICIDE CASE

11:43 AM, 16 Sep 2024 (IST)

వాహనాదారులకు అలర్ట్ - ట్యాంక్‌బండ్‌పై 20 నిమిషాల ప్రయాణానికి గంట సమయం - TANK BUND TRAFFIC IN HYDERABAD

Ganesh Immersion 2024 At Tank Bund : హైదరాబాద్​లో గణేశ్ నిమజ్జం నందడి మొదలైంది. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. భారీగా గణపయ్యలు నిమజ్జనానికి తరలిరావడంతో ట్యాంక్ బండ్ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచింది. 20 నిమిషాల ప్రయాణానికి గంట సమయం పడుతోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GANESH IMMERSION 2024

11:40 AM, 16 Sep 2024 (IST)

సంక్రాంతికి ఊరెళ్దామనుకుంటున్నారా? - టికెట్లు లేవండి బాబు - SANKRANTI TRAIN TICKETS ISSUE

Train Ticket Reservation for Sankranti Festival : సంక్రాంతి పండుగ సందడి ఇప్పటి నుంచే ప్రారంభమైంది. దసరా, దీపావళి పండగలు రాకముందే సంక్రాంతికి రైలు టిక్కెట్లకు పెద్దఎత్తున డిమాండ్‌ ఏర్పడింది. ఈ పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు నాలుగు నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ వందల్లో ఉండి రిగ్రెట్‌ వస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TRAIN TICKET RESERVATION SANKRANTI

10:41 AM, 16 Sep 2024 (IST)

నన్ను తీసుకొచ్చింది ఈ పోలీసే - నటి కాదంబరి అరుపులు - Kadambari Jethwani Fires on SI

Jethwani Files Complaint ibrahimpatnam police station : ముంబయి నటి కాదంబరి జెత్వానీ ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో వైస్సార్సీపీ నాయకుడిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అక్కడున్న ఓ ఎస్సైపై మండిపడ్డారు. 'ముంబయి నుంచి నన్ను తీసుకొచ్చింది' ఇతనే అంటూ పెద్దగా అరుస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KADAMBARI JETHWANI FIRES ON SI

10:14 AM, 16 Sep 2024 (IST)

అమెరికాలో జై బాలయ్య - న్యూ ఇంగ్లాండ్​లో NBK@50 ఇయర్స్ సెలబ్రేషన్స్ - NBK 50 Years Celebrations in USA

Hero Balakrishna Golden Jubilee Celebrations : నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. న్యూ ఇంగ్లాండ్​లో బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - NBK 50 YEARS CELEBRATIONS IN USA

09:31 AM, 16 Sep 2024 (IST)

పీసీసీ కార్యవర్గం కూర్పుపై చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్‌ ఫోకస్ - నేడు ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులతో సమావేశం - AICC Focus on PCC New Members

Tpcc Chief On Telangana PCC New Members 2024 : రాష్ట్ర పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్‌ గౌడ్‌ కార్యవర్గం కూర్పుపై దృష్టి సారించారు. ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నారు. పాత కార్యవర్గం, కమిటీలన్నీ రద్దు కావడంతో కొత్తగా పీసీసీ కార్యవర్గం ఏర్పాటు అనివార్యం కావడంతో వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ బలోపేతానికి పని చేసిన నాయకులకు కార్యవర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TPCC CHIEF MAHESH GOUD

08:51 AM, 16 Sep 2024 (IST)

'బతికిబట్టకట్టామని ఆనందపడాలో - చితికిపోయామని బాధపడాలో అర్థంకాని దుస్థితి' - FLOOD DAMAGE IN SURYAPET

Flood Effect in Suryapet : సూర్యాపేట జిల్లాలో ప్రకృతి చేసిన విలయ తాండవానికి జిల్లా వాసులు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లి అపార నష్టానికి కారణమయ్యాయి. ఇళ్లు కోల్పోయి కొందరు పంట నష్టపోతే, కుటుంబ పెద్దను కోల్పోయి మరికొందరు తీరని శోకంలో ఉన్నారు. జిల్లాలో ఏ తలుపు తట్టిన కన్నీటిని మిగిల్చే దృశ్యాలే కనిపిస్తున్నాయి. అటు వరదల కారణంగా పలు మండలాల్లో, గ్రామాల్లో రవాణా సౌకర్యం దెబ్బతింది. స్థానికులు, గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HEAVY CROP LOSS IN SURYAPET

08:47 AM, 16 Sep 2024 (IST)

ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్‌పై రేప్ కేసు - RAPE CASE AGAINST JANI MASTER

Rape Case Filed Against Jani Master : నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​పై హైదరాబాద్​లో కేసు నమోదైంది. తనను అత్యాచారం చేశాడంటూ, పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ అతడి వద్ద పని చేసే ఓ డ్యాన్సర్ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - RAPE CASE AGAINST JOHNNY MASTER

07:46 AM, 16 Sep 2024 (IST)

ఓరుగల్లులో గణేశ్ నిమజ్జనం - శోభాయాత్రగా తరలివెళ్లి గంగమ్మ ఒడికి చేరనున్న లంబోదరుడు - Ganesh Immersion In Warangal

Ganesh Immersion In Warangal : ఓరుగల్లులో వినాయక నిమజ్జన శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం పూజలనంతరం డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాటాలు ఊరేగింపులు నడుమ సందడిగా గణనాథుడు గంగమ్మ చెంతకు చేరుకోనున్నాడు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GANESH IMMERSION IN TELANGANA

07:43 AM, 16 Sep 2024 (IST)

సామాన్యుల్లోనూ 'హై'డ్రా గుబులు - నివాసాల కూల్చివేతలపై ఆందోళనలు - Hyderabad FTL And Buffer Zones

Hydra Identified FTL and Buffer Zones : రాష్ట్ర రాజధానిలో హైడ్రా కూల్చివేతలు రోజురోజుకు సంచలనంగా మారుతుండగా చెరువులు, కుంటల సమీపంలో నివసిస్తున్న ప్రజల్లో ఎఫ్టీఎల్‌ గుబులు పట్టుకుంది. తమ నివాసాలపై హైడ్రా ఎక్కడ విరుచుకుపడుతుందోననే ఆందోళనతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. చెరువుల పరిశీలనకు ఏ అధికారి వచ్చినా ఎఫ్టీఎల్‌, బఫర్‌ జోన్ల వివరాలను ఆరా తీస్తున్నారు. ఏ మ్యాప్‌ల ఆధారంగా హైడ్రా చర్యలు తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై మండిపడుతున్నారు. ఎఫ్టీఎల్‌, బఫర్ జోన్ల పేరుతో హుటాహుటిన వచ్చి తమ నివాసాలను కూల్చివేస్తే ఎలా బతికేదని వాపోతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDERABAD FTL AND BUFFER ZONES

Last Updated : Sep 16, 2024, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.