Praja Palana Dinotsavam Celebrations In Telangana : తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకున్నారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 17 September 2024
Telangana News Today Live : తెలంగాణ Tue Sep 17 2024 లేటెస్ట్ వార్తలు- రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు - ఉద్యమ అమరవీరులకు నివాళి - PRAJA PALANA DINOTSAVAM 2024
Published : Sep 17, 2024, 7:10 AM IST
|Updated : Sep 17, 2024, 9:54 PM IST
రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు - ఉద్యమ అమరవీరులకు నివాళి - PRAJA PALANA DINOTSAVAM 2024
గ్రౌండ్ ఫ్లోర్లో మునిగిన ప్రతి ఇంటికి రూ.25 వేలు - బైక్‌కు రూ.3000 ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం - AP CM Announced Special Package
Special Package for Flood Victims : విజయవాడ సహా ఇటీవల వర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. సర్వం కోల్పోయిన బాధితులు మళ్లీ నిలదొక్కుకునేలా ఊతమిచ్చింది. క్షేత్రస్థాయిలో నష్టం అంచనాలపై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిహారం వివరాలను ప్రకటించారు. | Read More
సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ వద్ద గణేశుడి నిమజ్జనాలు - క్రేన్ ఆపరేటర్లకు 'విశ్రాంతి బస్సు' - Ganesh Immersion in hyderabad
Ganesh Immersion in Saroornagar : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జనంలో పాల్గొంటున్న క్రేన్ ఆపరేటర్లకు రెస్టు బస్సును ఏర్పాటు చేశారు. సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ వద్ద గణేశుడి నిమజ్జనం ఘనంగా సాగుతోంది. | Read More
ప్రయాణికులతో కిక్కిరిసిన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ - గేట్లు మూసివేత - Huge Crowd at Metro Stations
Huge Crowd at Metro Stations : భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో గణనాథులను చివరిసారిగా దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో నిమజ్జనానికి వచ్చారు. ఈ క్రమంలో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ గేట్లను నిర్వాహకులు మూసివేశారు. పది నిమిషాలకు ఓసారి మెట్ల వద్ద గేట్లు తెరిచి ప్రయాణికుల్ని లోనికి అనుమితించారు. | Read More
సుప్రీంకోర్టు 'బుల్డోజర్ న్యాయం ఆపండి' ఆదేశాలు 'హైడ్రా'కు వర్తించవ్ : రంగనాథ్ - HYDRA Ranganath on SC Verdict
HYDRA Commissioner Ranganath Reaction : బుల్డోజర్ న్యాయం ఆపండి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తమకు వర్తించవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లోని నేరస్తులు, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే ఆ ఆదేశాలు వర్తిస్తాయని అన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని స్పష్టం చేశారు. | Read More
'హైదరాబాద్ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే హైడ్రాకు ప్రజలు సహకరించాలి' - cm revanth comments on hydra
CM Revanth on HYDRA : పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చేందుకు భూమాఫియా ప్రయత్నిస్తోందని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ల పాలకుల పాపమేనని సీఎం ధ్వజమెత్తారు. హైదరాబాద్ భవిష్యత్‌కు గ్యారంటీ ఇచ్చే హైడ్రాకు ప్రజలు సహకరించాలని కోరారు. సెప్టెంబరు 17ను ప్రజా పాలన దినోత్సవంగా జరపాలన్న నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షగా సీఎం రేవంత్ అభివర్ణించారు. నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికిన రోజును రాజకీయ ప్రయోజన కోణంలో చూడటం అవివేకమన్నారు. | Read More
అయ్య బాబోయ్ ఏంటా జనం! - గణేశ్ నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చిన భక్తులు - ganesh immersion in hyderabad
Ganesh Immersion in Hussain Sagar : భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం కన్నుల పండువగా సాగుతోంది. వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసరాలు సందడిగా మారాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిరావడంతో కోలాహలం నెలకొంది. | Read More
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌తో బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు : మహేశ్ కుమార్ గౌడ్ - PCC Chief Comments On BJP
PCC Chief Mahesh Kumar Goud Comments On BJP : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేశారు. హైదరాబాద్ ప్రజాపాలనలో విలీనమైన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. | Read More
2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ - అదే మోదీ ప్రభుత్వ లక్ష్యం : కిషన్‌రెడ్డి - KISHAN REDDY ON MODI GOVT
Kishan Reddy On Modi Govt : ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గత పదేళ్ల కాలంలో దేశాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఎంతో చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ పాలనలో జాతీయ రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు అభివృద్ధి చేశామని వెల్లడించారు. పది వందే భారత్ రైళ్లలో తెలంగాణకు ఒకటి కేటాయించామన్నారు. | Read More
బై బోలో గణేశ్ మహరాజ్ కీ - గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి - Khairatabad Ganesh Nimajjanam 2024
Ganesh Immersion in Hussain Sagar 2024 : వెళ్లి రావయ్యా గణపయ్య, మళ్లీ రావయ్యా లంబోదరా అంటూ ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతిని భక్తులు గంగమ్మ ఒడికి సాగనంపారు. అశేష భక్తుల పూజలందుకున్న బడా గణేశుడి నిమజ్జనం, ఘనంగా పూర్తైంది. శోభాయాత్ర ఆద్యంతం కనులవిందుగా సాగింది. మహాగణపతికి అడుగడుగునా భక్తులు నీరాజనం పలికారు. భారీ విజ్ఞాధిపతిని హుస్సేన్‌సాగర్‌లో నిజ్జమనం చేయడంతో మహాఘట్టం సంపూర్ణమైంది. | Read More
'మీ ఫోన్లో ఏం చేస్తున్నారు? ఇంకేం చూస్తున్నారో మాకు అన్నీ తెలుసు' - Cyber Crimes In Hyderabad
Cyber Crimes In Hyderabad : మీ ఐపీ అడ్రస్‌తో అశ్లీల వీడియోలు చూస్తున్నారు. 24 గంటల్లో దీనిపై వివరణ ఇవ్వాలి. లేదంటే అరెస్టు చేస్తామని కాల్స్ వస్తే అలర్ట్ కావాల్సిందే అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. రోజుకో పంథాలో నేరాలకు పాల్పడుతున్న ఈ కేటుగాళ్లు, తాజాాగా ఈ రూట్‌లో డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. | Read More
రూ.30.1 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ - ఈసారి ఎవరికి దక్కిందంటే? - Balapur Laddu Auction 2024
Balapur Laddu Auction 2024 : గణేశుడి పండుగంటే గల్లీ నుంచి దిల్లీ వరకు మాములుగా ఉండదు. ఈ ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులోనూ వేలంలో రికార్డు స్థాయి ధరతో ప్రత్యేక గుర్తింపు పొందాడు బాలాపూర్ గణేశుడు. గతేడాది రూ.27 లక్షలు పలికిన ఈ లడ్డూను, ఈసారి రూ.30.1 లక్షలకు కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. | Read More
తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం - పదేళ్ల పాటు విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడతాం : సీఎం - Praja Palana Dinotsavam 2024
Praja Palana Dinotsavam 2024 : తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఎవరూ తప్పు పట్టవద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నియంత నుంచి తెలంగాణకు స్వేచ్ఛ కల్పిస్తామని ఆనాడు ప్రజలకు భరోసా ఇచ్చామన్న ఆయన, పదేళ్ల పాటు విధ్వంసమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడతామని హామీ ఇచ్చారు. హైడ్రాను బెదిరిస్తున్న భూ మాఫియాను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. | Read More
తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించకుండా దిగజారుడు రాజకీయాలు : కిషన్ రెడ్డి - Telangana Liberation Day 2024
Central Minister Kishan Reddy On Telangana Liberation Day 2024 : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. | Read More
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ రాణి కుమిదిని నియామకం - Telangana New SEC Appoints
Government Appoints SEC : రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి రాణి కుమిదిని నియమితులయ్యారు. అదేవిధంగా రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎం.జి గోపాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. | Read More
హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం - కృత్రిమ నీటి కొలనులు ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ - Ganesh Immersion In Artificial pond
Ganesh Immersion In Hyderabad : భక్తులు ఏడాది పొడవునా ఎదురు చూసే వినాయక నిమజ్జన వేడుకకు రంగం సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న లంబోదరుడి విగ్రహాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే గంగ ఒడికి బయల్దేరనున్నాయి. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కృత్రిమ నీటి కొలనులు ఏర్పాటు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసే విగ్రహాలను సహజ నీటి వనరుల్లో నిమజ్జనం చేసి నీటిని కలుషితం చేయొద్దని హైకోర్టు ఆదేశాలున్నాయి. దీంతో అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు. | Read More
పరకాల అమరధామం : నిజాం నిరంకుశానికి నిలువెత్తు రూపం - నాటి అమరవీరుల త్యాగాలకు చిహ్నం - Parakala Amaradhamam
Parakala Amaradhamam In Warangal : నిత్యం వెట్టి చాకిరీ, బానిస బతుకులు. ఇదేమిటని ప్రశ్నించినవారిపై హత్యాచారాలు, ఊచకోతలు. అయినా పిడికిలి బిగించి నిజాం సైన్యంపై ఉప్పెనలా విరుచుకుపడి ఓరుగల్లును పోరుగల్లుగా మార్చారు. జాతీయ పతాకాన్ని ఎగరేయడానికి వచ్చినవారిపై తూటాల వర్షం కురిపించారు. జలియన్‌వాలా బాగ్ ఉదంతం గుర్తుకు తెచ్చే నిజాం ఆకృత్యాలకు సజీవ సాక్ష్యం పరకాల అమరధామం. | Read More
కొనసాగుతోన్న ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర - మధ్యాహ్నం 2 గంటలకల్లా గంగమ్మ ఒడిలోకి! - Khairatabad Ganesh Shobhayatra 2024
Khairatabad Ganesh Shobhayatra 2024 : నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నాడు. పది రోజులపాటు పార్వతీ తనయునికి పూజలు చేసిన భక్తులు, కన్నుల పండువగా గజముఖున్ని గంగమ్మ దగ్గరికి సాగనంపుతున్నారు. ఈ మేరకు చివరి పూజ సోమవారం సాయంత్రం నిర్వహించారు. సకాలంలో నిమజ్జనం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసున్నామని ఉత్సవ కమిటీ ప్రతినిధి మహేశ్ యాదవ్ తెలిపారు. ఇవాళ ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవ్వగా, మధ్యాహ్నం 2 గంటల వరకు నిమజ్జనం పూర్తి అవుతుందని పోలీసులు చెప్పారు. | Read More
రికార్డు బ్రేక్ రేటు : ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ ధర - ఎక్కడో తెలుసా? - Ganesh Laddu Auction 2024
Bandlaguda Laddu Auction 2024 : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్‌లో గణేశ్ లడ్డూ వేలం పాట మరోసారి రికార్డు సృష్టించింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో జరిగిన లడ్డూ వేలం పాటలో ఓ భక్తుడు ఏకంగా రూ.1.87 కోట్లు వెచ్చించి లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో లడ్డూ ధర రూ.1.20 కోట్లు పలికింది. | Read More
పల్లెలకు ఫ్రీ సోలార్ విద్యుత్ - పైలట్ ప్రాజెక్టు కింద 30 గ్రామాల్లో అమలు - Free Solar Power To Villages
Free Solar Power To Villages : రాష్ట్రంలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఇళ్లు, వ్యవసాయ బోర్లకు ఉచిత సౌరవిద్యుత్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ నిర్ణయించింది. ఆ గ్రామాాల్లో ప్రతి ఇల్లు, కార్యాలయం, వ్యవసాయ బోర్లు సహా మొత్తం అన్నింటికీ సౌరవిద్యుత్‌ను పూర్తిగా డిస్కం వ్యయంతోనే ఏర్పాటుచేయాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. | Read More
సెప్టెంబర్ 17 : ఇటు ప్రభుత్వ 'ప్రజా పాలన' - అటు బీజేపీ విమోచన దినోత్సవం - Praja Palana Day Celebrations
Telangana Praja Palana Day Celebrations 2024 : హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైన సెప్టెంబరు 17ను పురస్కరించుకుని రాష్ట్రంలో వేడుకలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం పేరుతో రాష్ట్రప్రభుత్వం, విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు జరగనున్నాయి. పార్టీల కార్యాలయాల్లోనూ జాతీయ జెండా ఎగురవేసి అమరవీరుల పోరాటాలు, త్యాగాల్ని స్మరించుకోనున్నారు. | Read More